Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Krishnagiri: గ్రామాల అభివృద్ధి జరగాలంటే మళ్ళీ వైసిపి రావాలి

Krishnagiri: గ్రామాల అభివృద్ధి జరగాలంటే మళ్ళీ వైసిపి రావాలి

మండలం నుండి గ్రామస్థాయికి పాలన అందించిన ఏకైక సర్కారు మాదే

ప్రజా సమస్యలు తీర్చడంలో ప్రజల వద్దకు పాలన అందించడంలో జగనన్న ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు. ప్రతి పథకం ఇంటింటికి వెళ్లి 50 కుటుంబాలకు ఒకరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ సచివాలయ సామ్రాజ్యం నిర్మించి ఒకే ఒక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా క్రిష్ణగిరి మండలం సోత్రం ఎర్రగుడి గ్రామంలో రూ 38.64 లక్షల నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రూ 23.94 లక్షలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా సెంటర్, రూ20.84 లక్షలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, జలజీవన్ మిషన్ క్రింద రూ. 41.90 లక్షలతో పూర్తయిన ఇంటింటికి కొళాయి పనులను, MGNREGS 15 లక్షల నిధులతో పూర్తి అయిన M.P.U.P స్కూల్ కాంపౌండ్ వాల్ ను గ్రామ సర్పంచ్ గిరిబాబు, ఎంపీటీసీ చందన రెడ్డి, ఎంపిపి డాక్టర్ కంగాటి వెంకట రామిరెడ్డి గారు, అధికారులు, గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కలసి పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ కలిసి ప్రారంభించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కృష్ణగిరి మండలం, సోత్రం ఎర్రగుడి గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మండల పంచాయతీరాజ్ అధికారులు, వ్యవసాయ అధికారులు, డాక్టర్లు, సచివాలయం సిబ్బంది, మండల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News