Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్KS Jawahar Reddy: చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వార్షిక నివేదిక

KS Jawahar Reddy: చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వార్షిక నివేదిక

మొబైల్ బ్యాంకింగ్ నూతన యాప్

చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వార్షిక నివేదికను విడుదల చేసి మొబైల్ బ్యాంకింగ్ నూతన యాప్ లాంచింగ్ చేశారు సిఎస్.డా.కెఎస్.జవహర్ రెడ్డి. ఈమేరకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అధ్యక్షులు టి.కామేశ్వరరావు తోపాటు ఆబ్యాంకు అధికారులు సిఎస్ ను కలిశారు. ఈసందర్భంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు 2022-23 ఆర్దిక సంవత్సర వార్షిక నివేదికను విడుదల చేసి మొబైల్ బ్యాంకింగ్ నూతన యాప్ ను సిఎస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ 8 జిల్లాలో 249 శాఖలతో 27 లక్షల మంది ఖాతదారులకు ఘననీయమైన సేవలందిస్తన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.

- Advertisement -

గత ఆర్థిక సంవత్సరానికి 17,582 కోట్ల వ్యాపారంతో అత్యుత్తమ ఫలితాలు సాధించిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు అధికారులు సిబ్బందికి మరియు ఖాతాదారులకు సిఎస్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఖాతాదారుల సౌకర్యార్ధం మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని మరింత సులభతరంగా అందించేందుకు CGGB MONEY 2.0 APP ఆవిష్కరించటం మంచి శుభ పరిణామమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.


చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ టి.కామేశ్వరరావు మాట్లాడుతూ తమ బ్యాంకు కనబరిచిన ఈ ఫలితాలు ఖాతాదారులకు మాపనితీరుపై ఉన్న నమ్మకానికి నిదర్శన మన్నారు. అంతేగాక బ్యాంకు సిబ్బంది నిబద్దతకు, అంకిత భావానికి అద్దంపట్టేలా ఉన్నాయని ఆనందం వ్యక్తంచేసారు.
ఈ కార్యక్రమంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్లు డా.బివి. రమణారావు, పి. మారుతీ రావు, ఆర్.యం.పి.వి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News