Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: నిమజ్జనంలో కోలాటాలతో కలెక్టర్ ఫ్యామిలీ సందడి

Kurnool: నిమజ్జనంలో కోలాటాలతో కలెక్టర్ ఫ్యామిలీ సందడి

తొలి నిమజ్జనం చేసిన కలెక్టర్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ వినాయకుడి విగ్రహం గత తొమ్మిది రోజులుగా విశేష పూజలందుకున్న పరిపాలన గణేశుడికి కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఘన వీడ్కోలు పలికారు. కలెక్టరేట్ ఆవరణంలో ప్రతిష్టించిన పరిపాలన గణపతి విగ్రహానికి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, జిల్లా కలెక్టర్ తల్లితండ్రులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ళ సుగుణ, బలరామయ్య, పూజలు చేసిన అనంతరం నిమర్జనం శోభాయాత్రలో భాగంగా కలెక్టర్ తో పాటు కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

శోభాయాత్రలో మహిళలతో కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా మహిళలతో ఏర్పాటు చేసిన కోలాటాల కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి సుజనతో పాటు వారి తల్లి సుగుణ పాల్గొని కోలాటం ఆడారు. కలెక్టరు వారి తల్లిదండ్రులతో కోలాటం ఆడే కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది. శోభాయాత్రలో భాగంగా వినాయక ఘాట్ వద్దకు చేరుకున్న పరిపాలన గణేశుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మొదటి విగ్రహానికి నిమర్జన కార్యక్రమం చేపట్టారు.


ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ సంజీవ కుమార్, కలెక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జేసీ నారాపురెడ్డి మౌర్య, కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, డిఆర్ఓ మధుసూదన రావు, కర్నూల్ ఆర్ డి ఓ హరి ప్రసాద్, బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి, మాజీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ ఎస్ వి విజయ మనోహరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News