మన హృదయాన్ని పదిలంగా చూసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని అన్నారు కర్నూలు ఎంపీ డా. సంజీవ్ కుమార్. వరల్డ్ హార్ట్ డేని పురస్కరించుకొని కిమ్స్ హాస్పిటల్ కర్నూలు వారి ఆధ్వర్యంలో 2కె వాక్ నిర్వహించారు. ఈ వాక్ లో కర్నూలు ఎంపీ డా. సంజీవ్ కుమార్, వైకాపా డాక్టర్స్ విభాగం జనరల్ సెక్రటరీ ఆదిమలపు సతీష్, 17వ వార్డ్ కార్పొరేటర్ పద్మలత, సుబ్బారెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్ సుబ్బారెడ్డి, కిమ్స్ కర్నూలు సిఓఓ డా. సునిల్ సేపూరి, మార్కెంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వాక్ రాజ్ వీహార్ లో సర్కిల్ లో ప్రారంభమై కర్నూలు కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడారు. మారుతున్న జీవనశైలికి తగ్గట్లు మన ఆహార అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. మన కోసం నిరంతరం పనిచేస్తున్న గుండె కోసం మనం ప్రతి రోజు ఒక గంట సమయాన్ని కేటాయించి తప్పకుండా చురుకైన నడక, వ్యాయామం చేయాలని తెలిపారు. ఐ&పీఆర్ కర్నూలు డిఫ్యూటీ డైరెక్టర్ కె. జయమ్మ సహకారంతో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ గుండె వైద్య నిపుణులు డా. నాగేంద్ర ప్రసాద్ మాట్లాడారు. హృద్రోగ సమస్యలపై అలసత్వం చేయవద్దని సూచించారు. ఆయన విలేకరులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనేక ఆరోగ్య సమస్యలు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. తక్కువ వయసు గలవారు ప్రధానంగా గుండె సంబంధిత సమస్యల వల్ల ప్రాణాలు కొల్పోతున్నారు. నిత్యం సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మితిమీరిన ఆల్కాహాల్, జంక్ఫుడ్స్, కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకుంటున్నారు. పైగా సరైన నిద్రసమయాలను కూడా పాటించడం లేదు. దీని వల్ల గుండె చుట్టూ కొవ్వు పేరుకపోతోంది. ‘హృదయాన్ని ఉపయోగించండి, హృదయాన్ని తెలుసుకోండి’ అనే థీమ్ తో ఈ సంవత్సరం ఈ వరల్డ్ హార్ట్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు. దీని వల్ల హార్ట్ఎటాక్, ప్రధాన రక్తనాళ సమస్యలు వస్తున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో అధికంగా జిమ్ చేయడం వల్ల కూడా ప్రాణాలు కొల్పోతున్నారు. ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు మరణాలు కూడా మనం చూశాం. మితంగా ఏదీ చేసినా… ఇబ్బందే. కాబట్టి ప్రతి ఒక్కరూ వైద్యులు పర్వవేక్షణలో నడుచుకోవాలి. క్రమ తప్పకుండా నిత్యం వ్యాయామం, వాకింగ్ చేయడం ఉత్తమం. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బిపి, బరువును అదుపులో ఉంచుకోవాలి. ఛాతీలో నొప్పి రావడం, అధికంగా చెమటలు పట్టడం, కొద్దిదూరం నడిచినా.. ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుల వద్దకు వెళ్లాలి.
ప్రధానంగా చెప్పుకోవాలంటే విలేకరుల జీవినశైలి అందరికంటే విభన్నంగా ఉంటుంది. వారు ఏ సమయంలో ఎక్కడ ఉంటారో వారికే తెలియదు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ కార్యక్రమంలో కర్నూలు పట్టణానికి చెందిన ప్రింట్ & టీవి ఛానెల్లకు సంబంధించిన విలేకరులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.