కర్నూలు జిల్లా సరిహద్దులలోని చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని కర్నూలు జిల్లా ఎస్పీ బి. కృష్ణకాంత్ ఆదేశించారు. ఆంధ్ర – కర్నాటక బార్డర్ జిల్లా సరిహద్దులో ఉన్న క్షేత్రగుడి చెక్ పోస్టును ఎస్పీ కృష్ణకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ చెక్ పోస్టుల వద్ద అక్రమ రవాణా జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కర్నాటక రాష్ట్రంలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా సరిహద్దు అలూరు సర్కిల్, హాలహర్వి పోలీసుస్టేషన్ల పరిధిలోని క్షేత్రగుడి, చింతకుంట చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం, వస్తువులు అక్రమ రవాణా జరుగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెక్ పోస్టులలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బందికి ఏమైన ఇబ్బందులుంటే నేరుగా ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Kurnool: ఆంధ్ర-కర్నాటక చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES