Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: బెల్ ఇంజనీర్లతో ఈవీఎంల యాక్సెప్టెన్స్ టెస్ట్ ప్రొసీజర్

Kurnool: బెల్ ఇంజనీర్లతో ఈవీఎంల యాక్సెప్టెన్స్ టెస్ట్ ప్రొసీజర్

కార్యక్రమాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా యాక్సెప్టెన్స్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళిని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని ఈవిఎంల గోడౌన్ లో బెల్ ఇంజినీర్లచే నిర్వహిస్తున్న యాక్సెప్టెన్స్ టెస్ట్ ప్రొసీజర్ ను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాకి కొత్తగా కేటాయించబడిన 7,020 బ్యాలెట్ యూనిట్లు, 5,460 కంట్రోల్ యూనిట్ లను ఈవిఎం ల గోడౌన్ లో భద్రపరచి బెల్ ఇంజనీర్ల ద్వారా యాక్సెప్టెన్స్ టెస్ట్ ప్రొసీజర్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మొత్తం ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా, పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి ని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి, బెల్ ఇంజనీర్లు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News