Kurnool Bus Accident: ప్రజలంతా ఉదయాన్నే మేలుకొనే సమయానికి దేశమంతా అల్లకల్లోలం సృష్టించిన వార్త కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం. పండుగకి అని కొందరు, సరదాగా గడిపి తిరిగి వెళ్తున్న మరికొందరు, ఉద్యోగాలు చేసుకునేవాళ్లు విద్యార్థులు.. ఇలా అంతా చిన్న వయసు వాళ్లే.. నిద్రలోనే అగ్నికి ఆహుతయ్యారు. వేమూరి ట్రావెల్స్‌కి చెందిన ప్రైవేట్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. అయితే బైక్ నడిపిన యువకుడు సైతం ఈ ప్రమాదంలో మృతి చెందాడు.

కాగా, ఈ బైక్ నడుపుతున్న వ్యక్తిని శివశంకర్‌గా పోలీసులు గుర్తించారు. కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన శివశంకర్.. గ్రానైట్, పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. డోన్ నుంచి తన ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: https://teluguprabha.net/crime-news/software-engineer-anusha-dies-in-kaveri-travels-bus-accident/
కర్నూలు జిల్లా ఆస్పత్రికి శివశంకర్ మృతదేహాన్ని తరలించగా.. మార్చురీ వద్ద యువకుడి తల్లి యశోద కుటుంబీకులు విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పెళ్లీడుకి వచ్చిన కొడుక్కి పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా జరగడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. గురువారం రాత్రి 9:30కి శివశంకర్.. కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడాడని.. ప్రతిరోజూ రాత్రి 8 గంటలకే ఇంటికి వచ్చేవాడని.. కానీ ఈ సారి రాలేదని తల్లిదండ్రులు విలపించారు.
Also Read: https://teluguprabha.net/crime-news/kurnool-bus-accident-16-traffic-cases-and-rs-23k-fines-revealed/
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ ప్రైవేట్ బస్సు.. బైక్‌ను బలంగా ఢీకొట్టి దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది. ఈ ఘటనలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయింది. ఫలితంగా బైక్‌లో మంటలు చెలరేగి అవి బస్సుకు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా బస్సు మొత్తం మంటలు చిక్కుకుపోయింది. ఇప్పటి వరకు దాదాపు 20 మృతదేహాలను అధికారులు వెలికితీయగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉండగా.. ప్రమాదం నుంచి 23 మంది సురక్షితంగా ఉన్నారు.


