Saturday, July 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: సెప్టెంబర్ 30 నాటికి భూ హక్కు పత్రాలు పంపిణీ చేయాలి

Kurnool: సెప్టెంబర్ 30 నాటికి భూ హక్కు పత్రాలు పంపిణీ చేయాలి

రీ సర్వే అంశాలపై వీడియో కాన్ఫరెన్స్

సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న భూ హక్కు పత్రాలు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రీ సర్వేకి సంబంధించిన అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు పత్రాల పంపిణీకి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించిందని సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న భూ హక్కు పత్రాలు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కొన్ని జిల్లాలో ఆన్లైన్ నందు పెండింగ్ లో ఉన్న కరెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అంటే భూ హక్కు పత్రాలలో వచ్చే వ్యక్తి పేరు, ఊరి పేరు, ఖాతా నెంబరు తదితర వాటిని వెరిఫై చేసే వాటిలో ఎటువంటి తప్పిదాలు లేకుండా ఈ శనివారం నాటికి పూర్తి చేయాలని తదనంతరం భూ హక్కు పత్రాలను జెనరేట్ చేసి ప్రింటింగ్ కి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

పెండింగ్ లో ఉన్న స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ నిర్దేశించిన గడువు లోపు పూర్తి చేయాలన్నారు. గతంలో భూమిలేని నిరుపేదలందరికీ అసైన్ చేసిన ప్రభుత్వ భూమిలో లబ్ధిదారుడు ఉన్నాడా, వారి వారసులు ఉన్నారా లేదంటే వేరే ఎవరైనా ఉన్నారా వారికి ఏ సంవత్సరంలో కేటాయించారు వంటి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియ సెప్టెంబర్ 10 తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ ఫేస్ 2 కింద పెండింగ్లో ఉన్న భూహక్కు పత్రాలు జిల్లాకు రాగానే త్వరితగతిన వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ రెడ్డి, రమణకాంత్ రెడ్డి, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News