Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: సియం పర్యటనను విజయవంతం చేయండి

Kurnool: సియం పర్యటనను విజయవంతం చేయండి

1000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకొని చర్యలు తీసుకుని సీఎం పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఈనెల 19న సీఎం పర్యటన పకడ్బందీ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కార్యక్రమాల పరిశీలకులు తలశిల రఘురాం, జిల్లా ఎస్.పి రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమంలో ఎలాంటి లోపాలు లేకుండా సూక్ష్మస్థాయిలో పరిశీలించుకుని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

బందోబస్తు, బహిరంగ సభావేధిక, హెలిప్యాడ్ లలో ప్రోటోకాల్ ప్రకారం అధికారులకు అప్పగించిన పనులను పరిశీలిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. హెలిప్యాడ్, మీటింగ్ సమీపాల్లో ఏర్పాటు చేసిన సేఫ్ రూముల్లో అత్యవసర మందులతో పాటు నిపుణులైన డాక్టర్లు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ, జిల్లా ఆసుపత్రి వైద్యాధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు అవసరమైన జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఏపీఎస్పిడిసిఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పి కె.రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా అన్ని భద్రతా చర్యలు చేపట్టామన్నారు.

బందోబస్తును వివిధ కేటగిరిలుగా విభజించి, భద్రత ఏర్పాట్లు చేసామని,ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పోలీసు ఉన్నతాధికారిని బాధ్యులుగా నియమించామన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. సుమారు 1000 మంది పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టామని ఎస్పీ వివరించారు.అంతకుముందు హెలిప్యాడ్, బహిరంగ సభా వేదికలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలసిల రఘురాం, జిల్లా కలెక్టర్ ఎస్పీలు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం 40 కోట్ల రూపాయలతో నిర్మిస్తోన్న వంద పడకల ఆసుపత్రి భవనాలను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, SSG డైరెక్టర్ రంగబాబు, అన్ని శాఖల జిల్లాధికారులు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి జె.వి సంతోష్, డోన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News