Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool Collector: ఆరోగ్య సురక్ష సద్వినియోగం చేసుకోవాలి

Kurnool Collector: ఆరోగ్య సురక్ష సద్వినియోగం చేసుకోవాలి

వైద్య సేవలు ఫ్రీగా అందిస్తున్నామని వివరించిన కలెక్టర్

ఆరోగ్య సురక్ష క్యాంప్ లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు. కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, కోడుమూరు శాసనసభ్యులు డాక్టర్ జె.సుధాకర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ప్రజలకు చెప్పడం కొరకే ఈ రోజు ఇక్కడికి వచ్చానన్నారు. ప్రజలు సంపాదించిన సంపదలో ఎక్కువ శాతం విద్యా, వైద్యం కోసం ఖర్చు పెడతారని అందులో కూడా చాలా శాతం మంది ప్రజలు సంపాదించిన సంపదలో ఇంటి ఖర్చులు తగ్గించుకోనైనా సరే ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ఆసుపత్రుల వద్దకు వెళ్తే జీవితాలను మెరుగుపరుచుకుంటామనే ఆశతో వెళ్తుంటారని ఇటువంటి సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నాణ్యతతో కూడిన విద్యను, వైద్యంను ప్రజల వద్దకు తీసుకొని వచ్చే గొప్ప ఆలోచన చేసిందని అందులో భాగంగానే బహుశా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారన్నారు.

- Advertisement -

ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఏడు రకాల పరీక్షలు చేసి ఏమన్నా బిపి, షుగర్, దీర్ఘకాలికమైన రోగాలు వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని అదే గ్రామంలో 15 రోజుల తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ ఏర్పాటు చేసి ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనే దాని మీద ప్రొఫైల్ ఐడి తయారు చేసుకొని సంబంధిత వారికి మందులు అందించడమే కాకుండా క్యాంపు ల వద్ద నివారించలేని రోగాలు ఏమైనా ఉంటే ఆరోగ్య శ్రీ సేవల ద్వారా ఆసుపత్రులకు రెఫర్ చేస్తారని, పూర్తిగా వారి రోగాన్ని నయం చేసిన తర్వాతే వారిని డిస్చార్జ్ చేసేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపొందించినట్టు చెప్పారు. ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కోసం ఎన్నడు లేనివిధంగా మన ఇంటి వద్దకే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. ఆరోగ్యమే మహా సంపద అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ క్యాంప్ వద్ద పిహెచ్సి సెంటర్ డాక్టర్లు మాత్రమే కాకుండా స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఉంటారని, క్యాంపు వద్ద మరో 24 రకాల వైద్య పరీక్షలు చేయుటకు వెసులుబాటు కూడా కల్పించారని కలెక్టర్ తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వార క్రియేట్ చేసిన ప్రొఫైల్ ఐడి కేవలం ఈ క్యాంప్ కి మాత్రమే పరిమితి కాదని, ఆరోగ్య సమస్యకు సంబంధించి ఆరోగ్య మిత్రల ద్వారా ఏ ఆసుపత్రికి వెళ్లిన మీరు గతంలో ఎటువంటి మందులు ఉపయోగించారు ఎటువంటి జబ్బులు ఉన్నాయి అనే విషయాన్ని ఈ ఐడి ద్వారా తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. బాలింతలు, గర్భవతులు ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా, బలంగా ఉంటామనే విషయాన్ని కూడా డిస్ప్లే రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అదే విధంగా చిన్న పిల్లలకు టీకాలు ఏవైనా సరైన సమయంలో ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే అటువంటి టీకాలు ఇక్కడే వేయించుకునే అవకాశం కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. క్యాంప్ లో ఏర్పాటుచేసిన మందులు, రక్త పరీక్షలు, ఈసిజి కి సంబంధించి ఏర్పాటు చేసిన గదిని తదితర వాటిని పరిశీలిస్తూ ఎంతమంది పరీక్షలు చేయించుకున్నారు, ఎటువంటి మందులు ఇస్తున్నారు అనే వివరాలను వైద్య సిబ్బందిని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. కోడుమూరు శాసనసభ్యులు డాక్టర్ జె.సుధాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామాలలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. ప్రపంచంలో కరోనా అనంతరం చాలా మంది యువత అనారోగ్యానికి గురి అవుతున్నారని అలా జరగకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గ్రామాలలో వైద్య సిబ్బంది చేత సర్వే నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించిన అనంతరం మెడికల్ క్యాంపు నిర్వహించి స్పెషల్ డాక్టర్ల చేత వ్యాధిగ్రస్తులకు ఉచిత చికిత్స అందిస్తున్నారన్నారు. తీవ్రవ్యాధులు ఉన్న వారిని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆసుపత్రులకు రెఫర్ చేసి ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తున్నారన్నారు. వైద్య పరంగానే కాకుండా విద్య పరంగా కూడా అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు గ్రామాలలో గడపగడప కు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారంచే దిశగా కృషి చేస్తున్నామన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఉల్చాల గ్రామములో దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందన్నారు. ఉల్చాల గ్రామంలో ఎస్సీ కాలనీలో స్మశాన వాటిక లేకపోతే ఒకటినర ఎకర స్థలం గుర్తించి స్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామ ప్రజల కోరిక మేరకు ఈ గ్రామంలో త్వరలో సామూహిక మరుగుదొడ్లకు భూమి పూజ కూడా నిర్వహిస్తామని శాసనసభ్యులు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ రూరల్ తహసిల్దార్ శివరాముడు, జిల్లా వైద్య శాఖ అధికారి రామ గిడ్డయ్య, గ్రామ సర్పంచ్ సాగర్, మండల ఎంపీపీ, మెడికల్ ఆఫీసర్స్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News