Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool collector: 'జగనన్న ఆరోగ్య సురక్ష' పకడ్బందీగా అమలు

Kurnool collector: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ పకడ్బందీగా అమలు

కలెక్టర్ స్ట్రిక్ట్ ఆర్డర్స్

‘జగనన్న ఆరోగ్య సురక్ష’ పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న “ఆరోగ్య సురక్ష” కి సంబంధించిన షెడ్యూల్ ప్రణాళికను వెంటనే ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించడం, గ్రామాలలో క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు అవసరమైన వారికి వైద్యం అందించడమే లక్ష్యంగా ఆరోగ్య సురక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చారని పేర్కొన్నారు.

- Advertisement -

సెప్టెంబర్ 15 నుండి వాలంటీర్లు, ఎఎన్ఎమ్ లు తమ పరిధిలోని గృహాలను సందర్శించి ప్రజలకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడంతో పాటు, ఇంట్లో ఉన్న వారి అనారోగ్య సమస్యలను గుర్తించి వారికి కావలసిన వైద్య సదుపాయాల వివరాలు సేకరించి యాప్ లో అప్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ గ్రామానికి “జగనన్న ఆరోగ్య సురక్ష ” టీం ఎపుడు వస్తారు అనే విషయాన్ని కూడా వారికి తెలియచేసి శిబిరానికి వారు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 30 నుండి అక్టోబరు 30 వరకు క్యాంప్ లు నిర్వహించాలని తెలిపారు. మండలంలో రెండు గ్రూప్ లుగా చేసుకొని తహసీల్దార్ మరియు ఎంపిడిఓ గ్రామములోని ప్రజలకు దగ్గరలో అనుకూలంగా ఉన్న ప్రదేశాన్ని నిర్ణయం చేసుకొని క్యాంప్ కు కావలసిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి క్యాంపుకు నలుగురు డాక్టర్లు ఉంటారని, అందులో ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారని, మరో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారన్నారు. హౌసింగ్ కు సంబంధించి గ్రౌండింగ్ శాతాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కల్లూరు మండలంలో మెరుగైన పురోగతి ఉంటే హాలహార్వి, చిప్పగిరి, కౌతాళం మండలాల్లో గ్రౌండింగ్ తక్కువగా అయ్యిందని, స్పెషల్ ఆఫీసర్లు, ఎంపిడిఓలు, హౌసింగ్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి గ్రౌండింగ్ శాతాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా నిర్దేశించిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కౌతాళం, వెల్దుర్తి, ఓర్వకల్లు, ఎమ్మిగనూరు మండలాల్లో పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సచివాలయాల వారీగా స్టేజ్ కన్వర్షన్ లో పురోగతి లేని ఓర్వకల్లు, నన్నూరు-1, కౌతాళం, కొసిగి లో వచ్చే వారం నాటికి జీరో స్టేజ్ కన్వర్షన్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నన్నూరు-1 లో ఎక్కువ ఇళ్లు ఉండి స్టేజ్ కన్వర్షన్ లో పురోగతి సాధించని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఆప్షన్-1, ఆప్షన్-2, థర్డ్ పార్టీకు సంబంధించి పురోగతి సాధించని వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు మ్యాజిక్ సోక్ పిట్స్ ను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు సంబంధించి సెప్టెంబర్ 30 వ తేది నాటికి రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లు, సచివాలయం భవనల నిర్మాణాలు పూర్తి చేసి సంబంధిత అధికారులకు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఏ విధంగా పూర్తి చేయాలని అనే దాని మీద ఒక ప్రణాళిక రూపొందించుకొని పూర్తి చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్స్ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించి సెప్టెంబరు 15వ తేది నాటికి పెండింగ్ లో ఉన్న 1.39లక్షల ఫార్మ్స్ డిస్పోజల్ చేయాల్సి ఉండగా, ఏఈఆర్ఓలు ఫార్మ్స్ డిస్పోజల్స్ చేయడంలో తక్కువగా పురోగతి సాధించారని ముఖ్యంగా కర్నూలు(అర్బన్), గొనేగండ్ల, చిప్పగిరి మండలాలలో ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయని రేపు ఉదయం నాటికి పురోగతి సాధించకుంటే సంబంధిత తహసిల్దార్ల మీద చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

జగనన్నకు చెబుదాంకు సంబంధించి పరిష్కరించిన అర్జీలకు సంబంధించి అర్జీదారుల నుంచి తీసుకునే ఈ-కెవైసి బుధవారం నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో బుధవారం, శనివారం నిర్వహించే కో ఆర్డినేషన్ సమావేశాలకు సంబందించిన మినిట్స్ శనివారం సాయంత్రం నాటికి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నాటికి ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా ఆదోని, కర్నూలు తక్కువ పురోగతి సాధించారని, పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ క్రాప్ బుకింగ్ చేసిన తర్వాత విఆర్ఓల లాగిన్ కి రాగానే వెంటనే ఈ కెవైసి చేయాలని కాని విఆర్ఓలు చాలా తక్కువ పురోగతి సాధిస్తున్నారని, పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత తహశిల్దర్ లను అదేశించారు. పిఎం కిసాన్ కి సంబంధించి ఆన్లైన్ పోర్టల్ నందు వ్యవసాయ శాఖ అధికారులు వారి లాగిన్లో సంబంధిత దరఖాస్తులను అనర్హులు కింద పెట్టిన ప్రతి యొక్క దరఖాస్తుకి సంబందించిన నివేదికలు పంపాలని మండల వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఆధార్ సీడింగ్, మ్యూటేషన్ పనులు కూడా సంబంధిత తహశీల్దార్ లు పూర్తి చేయాలని అన్నారు. ఈ సంవత్సరం జిల్లా అసైన్మెంట్ రివ్యూ కమిటీ కొత్తగా గుర్తించిన అర్హులైన లబ్ధిదారుల యొక్క వివరాలను కూడా ఆన్లైన్లో ఎక్కించడంలో చాలా తక్కువ పురోగతి సాధిస్తున్నారు, పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రీ సర్వేకి సంబంధించి నిర్దేశించిన గడువులోపు స్టోన్ ప్లాంటేషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగనన్న ఆరోగ్య సురక్ష స్టేట్ నోడల్ ఆఫీసర్ రవీంద్ర రెడ్డి, డిఆర్ఓ నాగేశ్వరరావు, సిపిఓ అప్పలకొండ, జడ్పీ సీఈఓ నరసరెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News