పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ గుమ్మళ్ళ సృజన తెలిపారు. కర్నూలు నగరంలోని బృందావన్ నగర్ లో మియావాకి పార్క్ ను కలెక్టర్ డా.జి.సృజన ప్రారంభించారు. స్థానిక బృందావన్ నగర్ లో ఐఏఎస్ ఆఫీసర్స్ వైవ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మియావాకి పార్కును నగర మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, సతీమణి అనూహ్యతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ, మున్సిపల్ కమిషనర్ సతీమణి అనూహ్య మియావాకి పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపొందించడంలో భాగంగా మియావాకి పార్కు లో 4,500 మొక్కలు నాటామని, ఇందులో నేరేడు, జామ, ఉసిరి, వేప తదితర 25 రకాల మొక్కలు ఉన్నాయని పార్క్ లో వాకింగ్ ట్రాక్, యోగా చేసుకోడానికి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. పచ్చని చెట్ల మధ్య మంచి గాలిని పీల్చుకుంటూ యోగా, వాకింగ్, ధ్యానం చేసుకోడానికి పార్క్ వీలుగా ఉందని, ప్రజలు పార్క్ ను సందర్శించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డిఈ రాజశేఖర్, మునిసిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Kurnool collector: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
నగరంలో పార్క్ ప్రారంభించిన కలెక్టర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES