Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool collector: 'స్పందన' అర్జీలను వేగంగా పరిష్కరించాలి

Kurnool collector: ‘స్పందన’ అర్జీలను వేగంగా పరిష్కరించాలి

జగనన్నకు చెబుదాంలో వచ్చిన కంప్లైంట్లు తక్షణం పరిష్కరించాలి

జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ పేర్కొన్నారు.

- Advertisement -

సమస్యలను నాణ్యతతో పరిష్కరిస్తూ, పరిష్కారానికి సంబంధించి అర్జీ దారునికి పంపించే ఎండార్స్మెంట్ స్పష్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకు చెబుదాం- స్పందన” కార్యక్రమంలో వచ్చిన వినతుల్లో భాగంగా జొన్నగిరి మండలం తుగ్గలికి చెందిన కె. ఆదినారాయణ రెడ్డికి సర్వే నెంబర్ 394/1 లో 20 సెంట్లు పట్టా భూమి కలదని పొరపాటున ఆన్ లైన్ లో అసైన్డ్ భూమిగా నమోదు చేశారని అలా కాకుండ పట్టా భూమి గా మార్పించాలని కోరుతూ అర్జి సమర్పించారు. కర్నూలు మండలం గొందిపర్ల గ్రామ ప్రజలు నాగరాజు, తిమ్మారెడ్డి, మోహిద్దీన్, రాముడు కర్నూలు ఆర్టీసీ డిపో వారు కర్నూలు నుండి గొందిపర్ల, పూల తోట గ్రామాలకు బస్ సర్వీస్ నడుపుచున్నారు. అయితే గొందిపర్ల నుండి పూల తోట గ్రామానికి వెళ్లే బస్సులను ఇందిరమ్మనగర్, సుందరయ్య నగర్ లలో దాదాపు 800 జనాభా ఉన్నదని బస్సును నడపాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కోడుమూరు నివాసి బి.శ్రీనివాసులుకు గోనెగండ్ల మండలం ఎస్ లింగం దిన్నె గ్రామ పొలిమేరలో సర్వే నెంబర్ 152/1A లో ఒక్క ఎకర 46 సెంట్ల భూమి కలదని ఈ భూమిని రికార్డుల యందు ఒక్క ఎకరా 29 సెంట్లు మాత్రమే నమోదయి ఉన్నదని అలా కాకుండా మిగులు భూమిని కూడా రికార్డులో నమోదు చేయించాలని కోరుతూ అర్జి సమర్పించారు.

క్రిష్ణగిరి మండలం గుండాలపాడు గ్రామ నివాసి E.పాపన్న గౌడ్ కు నెంబర్ 397/B లో 2 ఎకరాల 47 సెంట్ల భూమి కలదని మా భూమిపై నుండి హెవీ కరెంట్ లైన్స్ వెళ్లేందుకుగాను మా పొలములో పెద్ద లైన్స్ కరెంట్ పోల్స్ ఏర్పాటు చేసుకోవడానికి నష్టపరిహారం 80 వేల రూపాయలు చెల్లిస్తాం అంటున్నారని మా పొలాలు రెండు కార్లు పంట పండే పొలాలు కావున ఈ నష్టపరిహారం మాకు సరిపోదని ఇంకా ఎక్కువ నష్ట పరిహారం ఇప్పించాలని కోరుతూ అర్జి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె.మధుసూదన్ రావు, జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు నాగప్రసన్న లక్ష్మి, సీపీవో అప్పలకొండ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News