ఈ నెల 20 వ తేదీ నాటికి ఓటర్ల జాబితా సవరణ కు సంబంధించిన ఫార్మ్స్ డిస్పోజల్ ను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఈ ఆర్ ఓ, ఏఈఆర్ఓ లను ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ, ఆడుదాం ఆంధ్ర అంశాలపై ఈ ఆర్ ఓ, ఏఈఆర్ఓలు,స్పెషల్ ఆఫీసర్లు, ఎంపిడిఓ లతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 22, 23 తేదీల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై ప్రజెంటేషన్ పంపాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.. అందువల్ల ఈనెల 20వ తేదీ నాటికి ఫార్మ్స్ డిస్పోజల్ పూర్తి చేయాలని కలెక్టర్ ఈఆర్వో, ఏఈఆర్ఓ లను ఆదేశించారు. ఈపీ రేషియో, జెండర్ రేషియో బాగుండాలని, అనామలీస్, జంక్ క్యారెక్టర్స్ తదితర అంశాలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. డాక్యుమెంటేషన్ లో ఏ మాత్రం రాజీ పడదన్నారు. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కోసం నియమించిన స్పెషల్ ఆఫీసర్లు వెంటనే వెరిఫికేషన్ మొదలు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.. ఏ మండలాల్లో ఎన్ని ఫార్మ్స్ వెరిఫికేషన్ చేస్తున్నారో రోజువారీ నివేదికను తనకు సమర్పించాలని కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ మేరకు నివేదికలు తెప్పించుకోవాలని డిఆర్ఓను ఆదేశించారు.
ఆడుతాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి క్రీడాకారుల రిజిస్ట్రేషన్ లో వెనుకబడి ఉన్న నందవరం, కౌతాళం, దేవనకొండ ఎంపీడీవోలు రిజిస్ట్రేషన్ లో పురోగతి చూపించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే క్రీడాకారుల టీములను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. కిట్లు అందినట్లుగా అక్నాలెడ్జ్మెంట్ లు ఇంకా కొన్ని మండలాల నుండి ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదని, వెంటనే అప్లోడ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈఓ ని ఆదేశించారు..అదే విధంగా గ్రౌండ్ ల మ్యాపింగ్ కూడా పూర్తి కావాలని, క్రీడాకారుల టీమ్ లను ఏర్పాటు చేయాలని dsdo ను ఆదేశించారు. రీ సర్వేకు సంబంధించి 115 గ్రామాల లో ఫైనల్ ఆర్వోఆర్ శుక్రవారం లోపు పూర్తి కావాలని కలెక్టర్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య, జెడ్పి సీఈఓ నాసర రెడ్డి, డిఆర్ఓ మధుసూదన రావు తదితరులు పాల్గొన్నారు.