Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ఉగాది శుభాకాంక్షలు చెప్పిన కర్నూల్ కలెక్టర్

Kurnool: ఉగాది శుభాకాంక్షలు చెప్పిన కర్నూల్ కలెక్టర్

జిల్లా కలెక్టర్ డా జి.సృజన

ఉగాది పండుగ రోజున తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారంతో తయారు చేసిన ఉగాది పచ్చడిలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలన్నిటికీ ఉగాది పచ్చడి ప్రతీక అని తెలుపుతూ జిల్లా ప్రజలందరికీ క్రోధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ డా జి.సృజన తెలిపారు. క్రోధ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డా జి. సృజనని వేద పండితులు, అర్చకులు కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపి కలెక్టర్ ని ఆశీర్వదించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన మాట్లాడుతూ.. ఉగాది పేరులోనే యుగ ఆది అనే అర్థం ఉందని, అనగా ఈ ఏడాది ప్రారంభమని, తెలుగువారికి ఉగాది పండుగతోనే సంవత్సరం ప్రారంభమవుతుందని ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనరు, విజయవాడ వారి సూచనల మేరకు క్రోధ నామ సంవత్సర ఉగాది వేడుకలు-2024 సందర్భంగా కర్నూలు జిల్లాలోని దేవాలయములలో పనిచేయుచున్న ఒక వేదపండితుడు, ఇద్దరు అర్చకులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.10,116/-లు సంభావన, శాలువ, పండ్లు, ప్రశంస పత్రాలను కలెక్టర్ అందజేశారు.

కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నారాయణరెడ్డి, వేద పండితులు మల్లికార్జున శర్మ, అర్చకులు సత్యనారాయణ స్వామి, నరసింహమూర్తి, దేవాదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News