Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool Collectorate: కలెక్టర్ ఆఫీస్ మరమ్మతుకు శంకుస్థాపన

Kurnool Collectorate: కలెక్టర్ ఆఫీస్ మరమ్మతుకు శంకుస్థాపన

శంకుస్థాపన చేసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

కర్నూలు కలెక్టరేట్ కార్యాలయ భవనాల మరమ్మత్తుల నిమిత్తం 8.08 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలోని భవనాల పునరుద్ధరణ నిమిత్తం రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో మరమ్మతుల అంచనా మొత్తం 8.08 కోట్ల పనులకు బుగ్గన రాజేంద్రనాథ్ శంకుస్థాపన చేసారు.

- Advertisement -

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి బుగ్గన అధికారులతో మాట్లాడుతూ కలెక్టరేట్ భవనం నందు వర్షాకాలంలో నీరు కారకుండా లీక్ ప్రూఫ్ పనులు, భవనంలో ఉన్న అన్ని టాయిలెట్స్ పునరుద్ధరణ, పాడైపోయిన కిటికీలను తొలగించి యూపివిసి కిటికీలు అమర్చుట, సన్ షేడ్స్, అవసరమైన చోట ఫ్లోరింగ్, సునయన ఆడిటోరియం నందు సీటింగ్, సౌండ్ ప్రూఫ్, సౌండ్ సిస్టం, ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, ఏసి ఏర్పాటుకు ఈ నిధులను ఖర్చు చేయాలన్నారు. మరమ్మత్తులను నాణ్యతతో నిర్మించి ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండేలా భవనాన్ని సవరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ డా.జి.సృజనకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్ బివై.రామయ్య, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వర రావు, ఆర్ అండ్ బీ ఎస్.ఈ నాగరాజు, ఈ.ఈ సురేష్ బాబు, డి.ఈ రవిచంద్ర, 17వ వార్డు కార్పొరేట్ పద్మలత, ఆర్ అండ్ బీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News