Wednesday, March 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Posani: పోసాని కృష్ణమురళికి ఊరట.. జైలు నుంచి విడుదల..?

Posani: పోసాని కృష్ణమురళికి ఊరట.. జైలు నుంచి విడుదల..?

సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)కి ఊరట లభించింది. సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఆదోని పోలీసులు పోసానిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు ఆయన కర్నూలు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

మరోవైపు నరసరావుపేటతో పాటు రాజంపేటలో నమోదైన కేసుల్లోనూ ఆయనకు బెయిల్ లభించింది. ప్రస్తుతం కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా పోసాని ఉన్నారు. దీంతో బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాష్ట్రవ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదుకావడంతో ఆయా పోలీసులు అదుపులోకి తీసుకోకపోతే పోసాని విడుదల ఖాయమని న్యాయవాదులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News