Wednesday, November 13, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు పటిష్టభద్రత

Kurnool: దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు పటిష్టభద్రత

100 సీసీ కెమెరాలు, 5 డ్రోన్ల..

దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రతిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అన్నారు. హోళగుంద మండలం, దేవరగట్టులో బన్ని ఉత్సవ ఏర్పాట్లపై శనివారం అన్ని శాఖల అధికారులు, దేవస్థాన కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్ 12 వ తేది దసర ఉత్సవాలలో భాగంగా దేవరగట్టులో జరిగే శ్రీ మాల మల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవానికి బందోబస్తు ఏర్పాట్లపై సమావేశం నిర్వహిస్తున్నామని, బన్ని ఉత్సవం కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో బన్ని ఉత్సవం జరుపుకోవాలని దేవరగట్టు బన్ని ఉత్సవ భక్తులకు తెలియజేస్తున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు.

బన్నీ ఉత్సవ పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలను వినియోగిస్తామన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, బన్ని ఉత్సవం సందర్భంగా అక్రమ మద్యం సరఫరా, మద్యం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు.

ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య , ఆలూరు ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ , పత్తికొండ డిఎస్పి వెంకట్రామయ్య, ట్రైనీ డిఎస్పీ ఉష శ్రీ, సిఐలు ప్రసాద్, కేశవరెడ్డి, శ్రీనివాస నాయక్, హోళగుంద ఎస్సై బాల నరసింహులు , ఆయా శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News