Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు

Kurnool: ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు

పత్రికలకు సర్క్యులేషన్ ప్రాతిపదికన కాకుండా, ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలనీ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా ఉపాధ్యక్షులు దేవదాసు, జిల్లా కార్యవర్గ సభ్యులు గౌస్ మహమ్మద్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, అక్రిడేషన్ల కోసం ఇచ్చిన జీవో వల్ల జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జర్నలిస్టులు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న అనేక సౌలభ్యాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఈ వైఖరి పట్ల వర్కింగ్ జర్నలిస్టులు అందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకు జిల్లా కేంద్రంలో నాలుగు అదనపు అక్రిడేషన్లు మంజూరు చేయాలని, న్యూస్ పేపర్స్ కు సర్కులేషన్ నిబంధన పేరుతో కొత్త విధించకుండ ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలని, చిన్న పత్రికలకు అక్రిడేషన్ సంఖ్యను పెంచాలని, పీడీఎఫ్ లకు గతంలో మాదిరి రెండు అక్రిడేషన్లు ఇవ్వాలని, డెస్క్ జర్నలిస్టులు అందరికీ సర్కులేషన్ తో పని లేకుండా అక్రిడేషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాల విభజన నేపథ్యంలో బస్సు పాసులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేలా ఇవ్వాలన్నారు. జర్నలిస్టులు అందరికీ ఏసీ బస్సుల్లో కూడా పాసులు చెల్లెలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికి 3 సెంట్ల ఇంటి స్థలం, మరియు ఇండ్లు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు దాడుల నివారణ కమిటీని వెంటనే పునరుద్ధరించాలన్నారు. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని పునరుద్ధరించాలన్నారు. రైల్వే లో రాయితీలను పునరుద్ధరించాలని, తమిళనాడు తరహాలో జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. కరోనా వల్ల మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో దశల వారిగ ఆందోళన కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమయితే చలో విజయవాడ కార్యక్రమం కూడా చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని కలెక్టర్ అభిషేక్ కుమార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు దేవదాసు ,జిల్లా,కార్యవర్గ సభ్యులు గౌస్ మహమ్మద్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు హుస్సేన్,, జిల్లా నాయకులు సురేంద్ర ,చార్లెస్ వెంకటేశులు, సుధాకర్, రామాంజనేయులు, ప్రకాష్ ,బషీర్ ,రవి పాల్గొన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News