కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాల్లో వైద్య అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డా.V. వెంకటరంగా రెడ్డి మాట్లాడుతూ.. వైద్య అధ్యాపకులు, ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలనతో విధులు నిర్వహించాల్సిందేనన్నారు. ఆసుపత్రిలోని ఓపి, ఐపి విభాగాల్లో వైద్యులు-సిబ్బంది అందుబాటులో ఉండాలని హెచ్ఓడిలకు తెలియజేశారు.
ఆసుపత్రిలోని అన్ని వైద్య అధ్యాపకులు వైద్యులు, సిబ్బంది FRS, రిజిస్టర్ మెయింటెన్ చేయాలని హెచ్ఓడిసికి తెలియజేశారు.
ఆసుపత్రిలోని పేషెంట్స్ ను అవుట్ సైడ్ ఇన్వెస్టిగేషన్స్ లకు పంపకుండా తగు చర్యలు తీసుకోవాలని HODs కు ఆదేశించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాతిపతులతో ల్యాబ్ ఇన్వెసిగేషన్ కు సంబంధించి పేషంట్స్ కు అందుబాటులో తీసుకురావడం కోసం సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా, పేషెంట్ కు సక్రమంగా వైద్యం అందించాలని హెచ్ వో డిస్ కి ఆదేశించారు.
ఆసుపత్రిలో హెచ్ఓడిస్ మీటింగ్ లో వైద్య అధ్యాపకుల నుండి వినతులను స్వీకరించి, అనంతరం వారి వినతులను పరిష్కరించడానికి టీం వర్క్ చేస్తూ ఆసుపత్రికి అవసరమైన మందులు, ఇతరత్రా కొనుగోలు చేసి వారికి పరిష్కరిస్తానని తెలియజేశారు. ఆస్పత్రిలో త్వరలో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు వైద్య కళాశాల అడిషనల్ డిఎంఈ & ప్రిన్సిపల్ డా.సుధాకర్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డా.ప్రభాకర్ రెడ్డి, CSRMO డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO డా.హేమనలిని, వైద్య అధ్యాపకులు, డా.హరిచరణ్, డా.సీతారామయ్య, డా.మాధవి శ్యామల, డా.రేణుక, డా.రామ్ శివ నాయక్, డా.రాధారాణి, డా.శ్రీరాములు, RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నగాంజన్ పాల్గొన్నారు.