Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: మట్టిలో మాణిక్యాలు ఆ కళాశాల విద్యార్థులు

Kurnool: మట్టిలో మాణిక్యాలు ఆ కళాశాల విద్యార్థులు

మెడిసిన్, ఐఐటి, ఐఐఐటి, ఎన్ ఐ టి, సెంట్రల్ యూనివర్సిటీలకు ఎంపికైన 52 మంది

అది ఒక గురుకుల కళాశాల అక్కడ చదివే విద్యార్థులంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే అయితేనేం కార్పొరేట్ కళాశాలకు దీటుగా అక్కడి విద్యార్థులు ఫలితాలను సాధించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 52 మంది విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ లో అత్యున్నత స్థాయి కళాశాలల్లో సీట్లు సాధించారు. వారందరి ఎదుగుదలకు కారణమైన అధ్యాపక బృందంతో కలిసి జిల్లా కలెక్టర్ ను కలిశారు ఆ విద్యార్థులు…. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఆత్మ విశ్వాసం అభివృద్ధికి సోపానమని, దృఢ సంకల్పం ఉంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా సులభంగా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పేర్కొన్నారు. ఇంతకు ఆ కళాశాల ఎక్కడ అనుకుంటున్నారా కర్నూలు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కల్లూరు మండలం చిన్నటేకూరు లోనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాల….. ఐఐటి, నీట్ అకాడమీ ద్వారా శిక్షణ పొంది, మెడిసిన్, ఐఐటి, ఐఐఐటి, ఎన్ ఐ టి, సెంట్రల్ యూనివర్సిటీ లకు ఎంపికైన 52 మంది విద్యార్థులను కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు..

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న టేకూరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాల ఐఐటి, నీట్ అకాడమీ ద్వారా శిక్షణ పొంది, మెడిసిన్, ఐఐటి, ఐఐఐటి, ఎన్ ఐ టి, సెంట్రల్ యూనివర్సిటీ లకు 52 మంది విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు.. మెడిసిన్ కు సంబంధించి 40 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా ఇందులో 20 మంది మెడిసిన్ కు, 54 మంది విద్యార్థులకు గాను 32 మందికి ట్రిపుల్ ఐటీ, ఐఐటి, ఎన్ఐటి, సెంట్రల్ యూనివర్సిటీలకు 32 మంది విద్యార్థులు ఎంపిక కావడం చాలా గొప్ప విషయమని కలెక్టర్ విద్యార్థులను అభినందించారు.. గురుకుల కళాశాలలు వ్యక్తులుగా మరింత అభివృద్ధికి గణనీయంగా దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.. ఇదే అత్మ విశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలని కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించారు. ఏ.పి.సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల సంస్థల జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి మాట్లాడుతూ జగనన్న ఆణిముత్యాలు పథకంలో భాగంగా చిన్నటేకూరు గురుకుల కళాశాల విద్యార్థి రూ.50 వేలు నగదు పురస్కారం అందుకున్నట్లు కలెక్టర్ కు వివరించారు. కర్నూలు జిల్లాలో ఎనిమిది గురుకుల కళాశాలలు ఉన్నాయని, ఇందులో మూడు బాలురకు సంబంధించినవి, ఐదు కళాశాలలు బాలికలకు సంబంధించినవని, అన్ని కళాశాలల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతం సాధించడం జరిగిందని ఆమె కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల ఐఐటి నీట్ అకాడమీ ప్రిన్సిపల్ రామ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News