Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: హౌసింగ్ పనులపై కలెక్టర్ అసంతృప్తి

Kurnool: హౌసింగ్ పనులపై కలెక్టర్ అసంతృప్తి

హౌసింగ్ నిర్మాణ పనుల్లో ఎటువంటి పురోగతి లేదని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్లూరు మండలం బస్తిపాడు గ్రామంలోని నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత మూడు వారాల నుండి స్టేజ్ కన్వర్షన్ లో పురోగతి ఉండాలని చెబుతున్నప్పటికీ కూడా ఇంకా పురోగతి సాధించలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లే అవుట్ లో ఉన్న హౌసింగ్ వివరాల గురించి హౌసింగ్ సిబ్బందిని ఆరా తీశారు లేఅవుట్ లో మొత్తం 115 ఇళ్లు మంజూరు అయ్యాయని అందులో బిలో బేస్మెంట్ లెవెల్ లో 45, బేస్మెంట్ లెవెల్ లో 68, రూఫ్ లెవెల్ – 1, రూఫ్ కాస్ట్ -01 ఉన్నాయని హౌసింగ్ సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. బేస్మెంట్ లెవెల్లో ఉన్న 68 ఇళ్ళ నిర్మాణాలు రూఫ్ లెవెల్ కి పురోగతి ఎప్పుడు తీసుకొని వస్తారని అదే విధంగా బిలో బేస్మెంట్ లెవెల్ లో ఉన్న 45 ఇళ్ళ నిర్మాణాలు బేస్మెంట్ లెవెల్ లోకి ఎప్పుడు తీసుకొని వస్తారని హౌసింగ్ ఎఈ రమణారెడ్డిని అడగగా ఈ నెల చివరి నాటికి 15 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ నుండి రూఫ్ లెవెల్ కి మరో 15 ఇళ్లు బిలో బేస్మెంట్ లెవెల్ నుండి బేస్మెంట్ లెవెల్ కి తీసుకొని వస్తామని కలెక్టర్ కి తెలిపారు. ఈ నెల చివరినాటికి చెప్పిన మేరకు చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హౌసింగ్ ఎఈ ని హెచ్చరించారు. ఇళ్లు మొదలుపెట్టని వారు మొదలుపెట్టేలా మోటివేట్ చేయాలని, అదే విధంగా 35 వేల రూపాయలు ఎస్ హెచ్ జి గ్రూపుల ద్వారా రుణం తీసుకొని ఇంకా ఇల్లు మొదలుపెట్టని వారు ఉంటే వారు మొదలు పెట్టకుంటే రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటామని వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్లాలని కలెక్టర్ ఎంపీడీవో రమణ మూర్తిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీవో రమణ మూర్తి, హౌసింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News