Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: కౌలు రైతులకూ బ్యాంకు రుణాలు

Kurnool: కౌలు రైతులకూ బ్యాంకు రుణాలు

జిల్లా ఇంఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

సిసిఆర్సి కార్డులు ఉన్న కౌలు రైతులకు బ్యాంకుల నుండి త్వరితగతిన రుణాలు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా ఇంఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అదేశించారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జిల్లా ఇంఛార్జి కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ సిసిఆర్సి కార్డ్స్ కి సంబంధించి అర్హత ఉన్న కౌలు రైతులకు రుణాలు ఇప్పించడంలో చాలా తక్కువ పురోగతి ఉందని బ్యాంకర్స్ తో మాట్లాడి వారికి రుణాలు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వర్షపాతం నమోదు తక్కువగా కావడం వల్ల బెట్ట పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా 19- 19- 19, పొటాషియం నైట్రేట్, యూరియా వాడకం పట్ల రైతులకు ఎక్కువగా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. పిఎం కిసాన్ కి సంబంధించి అర్హులైన కొంతమంది రైతులు వారి ఖాతా నెంబర్లకు ఆధార్ సీడింగ్ చేయించుకోలేదని, వారి జాబితాను తహసిల్దార్ కార్యాలయాలకు పంపించి వారితో సమన్వయం చేసుకొని ఆధార్ సీడింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా అర్హులైన కౌలు రైతులు ఎవరైనా ఉంటే వారికి సిసిఆర్సి కార్డ్స్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

ఈ క్రాప్ బుకింగ్ కి సంబంధించి ఇంతవరకు 37 శాతం చేశారని అందులో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాధార అభివృద్ధి పథకం కింద జిల్లాకు 26 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరయ్యాయని, వీటిని గైడ్లైన్స్ ప్రకారం గ్రౌండింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఇంఛార్జి కలెక్టర్ ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి సంబంధించి పత్తికొండ ప్రాంతంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు స్థలాన్ని గుర్తించడం జరిగిందని అందుకు సంబంధించిన అడ్వాన్స్ పోసెషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఈడిని ఇంఛార్జి కలెక్టర్ ఆదేశించారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి పశు సంచార వాహనాల ద్వారా పశువులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారిని ఇంఛార్జి కలెక్టర్ ఆదేశించారు. మార్కెటింగ్ శాఖకు సంబంధించి మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత అధికారులకు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ డిఈని ఇంఛార్జి కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఏపీఎంఐపీ పిడి ఉమాదేవి, పశుసంవర్ధక శాఖ అధికారి డా.రామచంద్రయ్య, ఉద్యాన శాఖ అధికారి రామాంజనేయులు, ఏ.డి.ఏ శాలురెడ్డి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News