Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: కర్నూలు నగరం ప్రగతికి నిలయం

Kurnool: కర్నూలు నగరం ప్రగతికి నిలయం

వందలాది కోట్ల రూపాయలతో నగరంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులతో కర్నూలు నగరం ప్రగతికి నిలయంగా మారుతోందని నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు. మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 19వ వార్డు మథర్ ల్యాండ్ నందు రూ.50 లక్షల రూపాయలతో డబ్లూ.బి.యం. రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మేయర్ .బీవై.రామయ్య మాట్లాడుతూ నూతన రహదారులు, మున్సిపల్ స్థలాలకు ప్రహారీ గోడలు, డ్రైన్స్, టాయిలెట్లు, వీధిలైట్లు, సెంట్రల్ మీడియన్స్ ల నిర్మాణం, కూడళ్ళ, పార్కుల సుందరీకరణ, చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు, సంకల్ బాగ్ ప్రాంతాల ఆధునికీకరణ, సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న కమ్యూనిటీ హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, అర్బన్ హెల్త్ సెంటర్లు, శానిటేషన్ డివిజన్ కార్యాలయాలు, స్టేడియాలు, గ్రంథాలయాలు, పాఠశాలలు, కార్పొరేట్ కార్యాలయాలకు ధీటుగా నగర పాలక సంస్థ నూతన కార్యాలయం, ప్రత్యేక దృష్టితో స్మార్ట్, ఈట్ ఫర్ స్ట్రీట్స్, బయే మైనింగ్, ప్రత్యేక ప్రణాళికలతో తాగునీటి ప్రాజెక్టులు, శుభ్రతతో వాగులు వంటి పనులతో ఆదర్శ నగరంగా కర్నూలు నిలుస్తుందని అన్నారు. ప్రత్యేక ప్రణాళికలతో ఫలితంగా నగర రహదారుల్లో, పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందన్నారు. గత రెండేళ్లలో రూ.506 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టగా అవి వివిధ దశల్లో ఉన్నాయని, ఎక్కడా కూడా కమిషన్లు కోసం నాసిరకం పనులు చేయించలేదన్నారు. ఏడాది క్రితం మునగాలపాడులో ప్రారంభించిన 15 ఎం.ఎల్.డి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తి అయిందని, వచ్చే వారం ప్రారంభిస్తామన్నారు.

ఎమ్మెల్యే.కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ…గత నాలుగేళ్ల వైయస్ జగన్ ప్రభుత్వంలో కల్లూరు అర్బన్ ప్రాంతం ఎంతో పురోగతి సాధించిందన్నారు. కల్లూరు అర్బన్ లో తాగునీటి సమస్య చాలా వరకు తగ్గించామన్నారు. 16 వార్డుల్లో రూ.31.34 కోట్లతో 234 రకాల వివిధ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. జగన్నాథ గట్టు మీద 50 ఎల్.ఎల్.డి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అలాగే నగరంలో 21 వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.115 కోట్లు మంజూరు చేసిందని, ఆ పనులు పూర్తి అయితే కల్లూరుతో పాటు నగరంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్నారు.

ఈకార్యక్రమంలో… డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, రాష్ట్ర వీరశైవ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, కార్పొరేటర్లు లక్షిరెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి, ఎస్.ఈ. డి.వేణు గోపాల్, ఎం.ఈ. పి.వి. శేషసాయి, డిఈఈ రవిప్రకాష్ నాయుడు, ఏ.ఈ. జనార్ధన్, శానిటేషన్ ఇంస్పెక్టర్ ఆర్.రాజు, ట్యాప్ ఇంస్పెక్టర్ రఫిక్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి హనుమంత్ రెడ్డి, నాయకులు కనికే శివరాం స్వామి, నాగరాజు, డిష్ అనిల్, విష్ణువర్థన్ రెడ్డి, వేదవతి, చంద్రిక, సాయి, తిరుపాలు, ఎస్.కే. యూనూస్, రాజేష్, నాగరాజు, బాబాన్న తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News