రాష్ట్రంలో మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం రైతులకు ఎందుకు సక్రమంగా సాగునీరు అందించడం లేదు అని కౌతాళం మండలం పొదలకుంట గ్రామం దగ్గర తుంగభద్ర ఎల్ ఎల్ సి సాగునీటి కాలువను చివరి ఆయకట్టకు నీరు అందక ఎండిపోయిన పంటలను మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి బుధవారం పరిశీలించారు…
అనంతరం తిక్కారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే అధికారులు గాని, వైసీపీ ప్రభుత్వ నాయకులు గాని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అర్థం కావడం లేదని, రైతులు చాలా ఖర్చులతో పెట్టుబడి పెట్టి పంట కోత కోసే సమయంలో నీరు లేకపోవడం వల్ల చాలా పంటలు ఎండి పోతుంటే వైసిపి ఎమ్మెల్యే బాలనాగరెడ్డికి, ఎల్ ఎల్ సి అధికారులకు కనపడటం లేదా అని ప్రశ్నించారు.. పంట ఎండిపోయి, నష్టపోయిన రైతులకు తక్షణమే వరి రైతులకు ఎకరాకు 50 వేలు, మిరప రైతులకు ఎకరాకు లక్ష , పత్తి రైతులకు ఎకరాకు 70 వేలు సహాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని ,అలాగే నిలిచిపోయిన సాగు నీటి సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు..
లేనిపక్షంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.. పంటలకు సాగునీరు అందక తాము పడుతున్న కష్టాలను ఈ సందర్భంగా రైతులు ఆయనకు తెలియజేశారు… రైతుల తరఫున తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా పోరాటాలు చేస్తుండని ఆయన తెలిపారు … జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చేన్నబసప్ప , తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి