Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: కర్నూలు, నంద్యాల జిల్లాలపై డీజీపీ రివ్యూ

Kurnool: కర్నూలు, నంద్యాల జిల్లాలపై డీజీపీ రివ్యూ

పోలీసుల పనితీరుతో తగ్గుముఖం పడుతున్న నేరాలు

కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన రేంజ్ డిఐజి, కర్నూలు జిల్లా ఎస్పీ, నంద్యాల జిల్లా ఎస్పీ, సెబ్ అడిషనల్ ఎస్పీ తో పాటు పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి కే.వి.రాజేంద్రనాథ్ రెడ్డి.

- Advertisement -

ఈ సంధర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు సమర్థవంతంగా పని చేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయని తెలియచేశారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగులో విన్నూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని, మరింత ద్విగుణీ కృత ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ ను అందిస్తామని తెలియచేశారు.
ఈ సంధర్భంగా డి‌జి‌పి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలలో NCRB డేటా ప్రకారం నమోదైన 26,000 మంది మిస్సింగ్ కేసులలో 23,300 మందిని గుర్తించి వారిని ఇళ్లకు చేర్చాం. ట్రేస్ అయ్యే కొద్ది కేసులు పూర్తిగా తగ్గుతూ వస్తాయన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి.అంతేకాకుండా నేరాలు నియంత్రనే లక్షంగా పోలీసులు పనిచేస్తున్నారు. గత మూడు సంవత్సరాల గణాంకాలతో పోలీస్తే 6 నెలల కాలంలో నేరాలు గణనీయంగా తగ్గాయి.నేరాల నియంత్రణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము.

కర్నూలు , నంద్యాల జిల్లాలో వరకు 6 నెలల కాలంలో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో పరిశీలించామన్నారు. గత 3 సంవత్సరాలతో పోల్చి( 2020, 2021, 2022, 2023 జనవరి నుండి జూన్ వరకు ) గణాంకాలను పోల్చి చూశము. నేరాల నియంత్రణ శాతం గణనీయంగా తగ్గింది. కర్నూలు జిల్లాలో బాడీలీ ఆఫెన్స్, మర్డర్, డౌరీ డెత్, హత్యాయత్నం మొదలగునవి గ్రేవ్ క్రైమ్ నేరాలలో 27 శాతం తగ్గింది. నంద్యాల జిల్లాలో బాడీలీ ఆఫెన్స్ 25 శాతం తగ్గాయన్నారు.

మహిళల పై నేరాలు
కర్నూలు జిల్లా లో 46 శాతం,
నంద్యాలలో 65 శాతం తగ్గాయన్నారు.

రోడ్డు ప్రమాదాలు
కర్నూలు జిల్లాలో 39 శాతం,
నంద్యాలలో 36 శాతం తగ్గాయన్నారు.

ఎస్సీ ఎస్టీ నేరాలలో 27 శాతం తగ్గాయన్నారు.

దిశా యాప్ తో నేరాలు చాలా వరకు నియంత్రణలోకి వచ్చాయి. (ముఖ్యంగా మహిళలపైనా జరుగుతున్నా నేరాలు.). దిశా యాప్ కు ఫిర్యాదులు బాగా వస్తున్నాయన్నారు. వాటిని పరిష్కరించడం తో నేరాల తగ్గుదల కనిపించింది.

కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్:
కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని గత సంవత్సరం(2022) నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాము. దీని ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ విధానం ద్వారా నేరాల తీవ్రత ఆధారంగా గుర్తించిన 122 కేసుల్లో 100 కేసుల విచారణ పూర్తయింది. మహిళలపై నేరాలు, పోక్సో కేసులు మరియు ఇతర తీవ్రమయిన నేరాలకు సంబంధించిన కేసులను పైలట్‌ ప్రాతిపదికన గుర్తించి అత్యంత పకడ్బందీగా కేసు విచారణ చర్యలు చేపట్టడం జరిగింది. ఈ 100 కేసుల్లో డెత్ పెనాల్టీ మొదలుకొని 30 ఏళ్ళ నుండి 40 ఏళ్ళ వరకు న్యాయస్థానలు నింధితులకు జైలు శిక్షలు విధించడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం 13,000 కేసులను కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ లో ప్రతి పోలీసు అధికారికి 10 కేసుల చొప్పున కేటాయించి 1400 కేసులలో ట్రయల్ పూర్తయి 62 శాతం రికార్డు స్ధాయిలో కన్విక్షన్ నమోదైంది. లక్ష్యం నిర్దేశించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా 3 నెలల్లోనే తీవ్రమైన నేరాలను పరిష్కరిస్తున్నాం.

క్రైమ్ తగ్గడంతో పాటు,అదుపులోనే ఉంది.మరోపక్క రౌడీ మూకల పై గట్టి నిఘాను కొనసాగిస్తున్నాము.
నేరాల నియంత్రణ కోసం పోలీసు యంత్రాంగం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది.
గత సంవత్సరం లో రౌడీ మూకలపై, అక్రమ మద్యం రవాణా చేసే గ్యాంగ్ లకు సంబంధించి 35 మంది పైన PD యాక్టు ప్రయోగించాము.ఈ సంవత్సరం కూడా పిడి యాక్టులు సిద్ధం చేశాము. అదే విధంగా పోలీసుశాఖలో అర్హులైన వారందరికి నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తున్నాము.ఇటీవల సూపర్ న్యూమరి డిఎస్పీలను రెగ్యూలర్ డిఎస్పీలుగా పదోన్నతులు కల్పించామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News