Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: హోంగార్డులకు పోలీసు దర్బార్

Kurnool: హోంగార్డులకు పోలీసు దర్బార్

హోం గార్డుల ఆరోగ్యం, భద్రతపై సూచనలు

హోం గార్డులకు పోలీసు దర్బార్ కార్యక్రమం నిర్వహించారు కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్. జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ హోంగార్డులతో మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనం పై వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు. కుటుంబాల గురించి ఆలోచించాలన్నారు. (ఇన్సూరెన్స్ ) బీమా చేసుకోవాలన్నారు. సంవత్సరానికి ఒకసారి మెడికల్ చెక్ అప్ చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. సిబ్బంది సమస్యల తీవ్రతను బట్టి పరిష్కరించుటకు కృషి చేస్తామన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే జిల్లా పోలీసు కార్యాలయంలో తనకు నిర్భయంగా తెలియజేసుకోవచ్చన్నారు. తనకు మెసెజ్ గాని లేదా వాట్సప్ కు గాని సమాచారం తెలియజేయవచ్చన్నారు. సమస్యను బట్టి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తామన్నారు. పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు.

- Advertisement -

అనంతరం కర్నూలు యూనిట్ లో పని చేస్తున్న మదన్ గోపాల్ ( హెచ్ జి 1153) హోంగార్డు అనారోగ్యంతో చనిపోయారు. అతని స్ధానంలో అతని భార్య బి. నాగేశ్వరమ్మకు హోంగార్డు ఉద్యోగం కల్పించారు. ఆదోని యూనిట్ కు చెందిన హోంగార్డు దేవేంద్రప్ప( హెచ్ జి 357 ) ప్రమాదవ శాత్తు గాయపడ్డాడు. ఇతనికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం హోంగార్డ్సు కంట్రిబ్యూషన్, ఆదోని పోలీసులు కలిసి రూ. 2 లక్షల 59 వేలు జిల్లా ఎస్పీ , హోంగార్డు కమాండెంట్ చేతుల మీదుగా హోంగార్డు దేవేంద్రప్ప భార్య ఎమ్ . లక్ష్మీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి, హోంగార్డు డిస్పీ కృష్ణమోహన్ , హోంగార్డు ఆర్ ఐ శివారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News