పారదర్శకంగా పోలీసుల బదిలీల ప్రక్రియను చేపట్టారు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్. 68 మంది పోలీసులకు బదిలీలు జరగ్గా వారిలో ముగ్గురు ఎఎస్సైలు , 18 మంది హెడ్ కానిస్టేబుల్స్, 47 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేశామని కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ తెలిపారు. ఖాళీలకు అనుగుణంగా పోలీసుస్టేషన్ లను ఎంపిక చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాల్లో ఒకే చోట 5 సంవత్సరాలు పూర్తి చేస్తుకున్న కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ స్థాయి వరకు ఉన్న పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టారు.
వివిధ పోలీస్ స్టేషన్ లు, ఆయా విభాగాలలోని ఖాళీల వివరాలను సులువుగా ఎంపిక చేసుకునే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేశారు. ఒక్కొక్కరిని పిలిచి ఇదివరకు పనిచేసిన సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ , స్వంత మండలం కాకుండా మిగిలిన పోలీస్ స్టేషన్ లలో ఉన్న ఖాళీల ఆధారంగా కాన్ఫరెన్సు హాల్ లో తెర పై చూపించి వారు కోరుకున్న చోటికి బదిలీ చేశారు. చీఫ్ ఆఫీస్ ఉత్తర్వల మేరకే సాధారణ బదిలీలలో భాగంగా పోలీసుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టామన్నారు. ఈ బదిలీల ప్రక్రియలో డిపిఓ ఏఓ సురేష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ ప్రసాద్ పాల్గొన్నారు.