రహదారి భద్రతా నియమాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని..జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ విజ్ఞప్తి చేశారు. కార్లు నడిపే వాహనదారులు తప్పని సరిగా సీట్ బెల్ట్ ధరించి వాహనాల్సిందేనంటూ సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని జిల్లా ఎస్పీ అన్నారు. వాహనదారులంతా అతివేగంతో డ్రైవ్ చేస్తూ..సెల్ఫోన్లో మాట్లాడటం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.
రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా కర్నూలు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి కొండారెడ్డి బురుజు మీదుగా రాజ్ విహార్, కలెక్టర్ కార్యాలయం, సీ క్యాంప్ సెంటర్ చెక్ పోస్ట్ వరకూ రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో రెండవ రోజు కార్లు, బైక్ ర్యాలీ నిర్వహించారు.