వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ పథకం ద్వారా జిల్లాలోని 2,96,739 మంది రైతులకు రూ.122.58 కోట్లు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుండి వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ పథకం కింద ఐదవ ఏడాది రెండవ విడత ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేశారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు డాక్టర్ జె.సుధాకర్, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, కెడిసిసి బ్యాంకు ఛైర్మన్ విజయ మనోహరి, డిసిఎంఎస్ ఛైర్మన్ శిరోమణి మద్దయ్య, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్దూరు సుభాష్ చంద్రబోస్, రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకం కింద రైతులకు వరుసగా ఐదవ ఏడాది రెండవ విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అందులో భాగంగా జిల్లాలో ఉన్న 2,96,739 మంది రైతు కుటుంబాలకు రూ.122.58 కోట్లు నేరుగా వారి ఖాతాలలోకి జమ చేయడం జరిగిందన్నారు. అందులో జిల్లాలో యాజమాన్యపు హక్కులు ఉన్న రైతులు 2,89,141 మంది రైతులకు, ఆర్ఓఎఫ్ ఆర్ పట్టాలు ఉన్న 03 మంది రైతులు, 7,306 మంది కౌలు రైతులకు, 289 మంది దేవాదాయ భూములు సాగుదారులకు ఒక్కొకరికి నాలుగు వేలు చొప్పున మొత్తం లబ్ధి పొందుతున్న 2,96,739 మంది రైతులకు రూ.122.58 కోట్లు జమ చేయడం జరిగిందని నూతనంగా రైతు భరోసా పథకం క్రింద నమోదైన రైతులకు మొదటి, రెండవ విడత (7500+4000-11,500/-) కలుపుకొన్న నగదును కూడా ప్రస్తుతం జమ చేశామన్నారు. పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే మంచి ఉద్దేశ్యంతో రైతులకు ఆర్థికంగా చేయూత ఇవ్వడమే కాక వారికి అవసరమైన నాణ్యమైన విత్తనాలు, పంటలకు అవసరమైన మందులు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుందని, రైతులకు ఉచితంగా పంట భీమా సదుపాయం కూడా కల్పిస్తామన్నారు.
కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్ మాట్లాడుతూ వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ ద్వారా రైతులకు అందజేసే ఈ ఆర్థిక నగదు ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నగదు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అదే విధంగా రైతులు పొలంలో వేయాల్సిన పంట పట్ల వారికి అవగాహన కల్పించేందుకు గాను పొలంబడి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ పథకం ద్వారా జిల్లాలోని రైతన్నల ఖాతాల్లోకి వరుసగా ఐదవ ఏడాది రెండవ విడత ఆర్థిక సాయంగా జమైన నగదు వివరాలు నియోజకవర్గాల వారీగా కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి 40,017 మంది రైతులకు రూ.16కోట్లు, ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి 41,234 మంది రైతులకు రూ.16.49కోట్లు, మంత్రాలయం నియోజకవర్గానికి సంబందించి 45,209 మంది రైతులku💐 రూ.18.8కోట్లు, ఆదోని నియోజకవర్గానికి సంబంధించి 20,524 మంది రైతులకు రూ.8.20కోట్లు, పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి 58,898 మంది రైతులకు రూ.23.55కోట్లు, పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 22,890 మంది రైతులకు రూ.9.15కోట్లు, ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి 67,967 మంది రైతుల ఖాతాల్లోకి రూ.27.18కోట్లు జిల్లా మొత్తంగా 2,96,739 మంది రైతులకు రూ.122.58 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి రైతులకు అండగా నిలిచిందని జిల్లా కలెక్టర్ వివరించారు. అనంతరం వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులు లబ్ది పొందిన రూ.122.58 కోట్ల మెగా చెక్కును జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, కెడిసిసి బ్యాంకు ఛైర్మన్ విజయ మనోహరి, డిసిఎంఎస్ ఛైర్మన్ శిరోమణి మద్దయ్య, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుభాష్ చంద్రబోస్ చేతుల మీదుగా రైతులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఏపీఎంఐపి పిడి ఉమాదేవి, హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు, పశు సంవర్థక శాఖ అధికారి రామచంద్రయ్య, ఎల్డిఎం రామచంద్రరావు, రైతులు పాల్గొన్నారు.