Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: 'స్పందన'లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

Kurnool: ‘స్పందన’లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ లను నాణ్యతగా పరిష్కరించడం అత్యంత కీలకం

‘జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్’ లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మరియు మండలాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ లను నాణ్యతగా పరిష్కరించడం అత్యంత కీలకమన్నారు. గ్రీవెన్స్ పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సకాలంలో పరిష్కరించడం ముఖ్యమన్నారు. ప్రత్యేక దృష్టి సారించి గ్రీవెన్స్ ను పెండింగ్ ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యతగా గ్రీవెన్స్ కు పరిష్కారం చూపించి రీఓపెన్ రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు గ్రీవెన్స్ పరిష్కారం పై ప్రతిరోజు మానిటర్ చేయాలన్నారు.
జులై 1 నుండి ఆగస్టు 1 వరకు జిల్లా లో నిర్వహించే జగనన్న సురక్ష పథకం లో భాగంగా జూన్ నెల 24 నుండి 30 వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయుట మరియు సచివాలయ పరిధిలో  నిర్వహించే క్యాంపు ల  ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలని ఆర్డీఓలు,  మండల ప్రత్యేక  అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు,యం.పి డి ఓ ల  ను ఆదేశించారు.ఈ నెల 24 నుండి 30 వరకు వార్డు,గ్రామ సచివాలయ పరిధిలోని ప్రతి ఇంటింటికీ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది  వెళ్లి వారికి ప్రభుత్వం నుండి ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం ఉందో తెలుసుకోవాలని సూచించారు.. కార్యక్రమం విజయవంతం అయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జాతీయ కుష్ఠు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 26 వ తేదీ నుండి జూలై 16 వ తేదీ వరకు 21 రోజులు ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు..
సచివాలయ వ్యవస్థ ద్వారా లెప్రసీ అనుమానిత వ్యాధిగ్రస్తులను సమర్థవంతంగా గుర్తించడానికి గాను ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు సర్వే నిర్వహించి ఇంకా ఇంత వరకు గుర్తించని/నమోదు కానీ కేసులను గుర్తించి సదరు వ్యాధి ఇతరులకు సోకకుండా సర్వే చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకుగాను జిల్లా పరిషత్ సిఈఓ, మున్సిపల్ కమీషనర్లు సచివాలయ, వాలంటీర్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆశా, వాలంటీర్లు జూన్ 26వ తేది నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి అనుమానితులను గుర్తించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు కూడా వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్ళినప్పుడు హౌసింగ్ సంబంధించి ఏ విధంగా అయితే సమీక్షలు నిర్వహించుకొని పనులలో పురోగతి సాధిస్తున్నారో అదే విధంగా లెప్రసీ వ్యాధిగ్రస్తులను గుర్తించడం, . కాలానుగుణంగా వచ్చే డెంగ్యూ, మలేరియా వ్యాధులపై మండల స్థాయి అధికారులు దృష్టి సారించాలన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు 23 కేంద్రాలలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయని, మిగితా 34 కేంద్రాల్లో కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలన్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న జిల్లా రిజిష్టర్ ను సంప్రదించి సమస్యను నివృత్తి చేసుకొని రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలన్నారు.
సమావేశంలో డిఆర్ఓ నాగేశ్వర రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రమ, నాగ ప్రసన్న లక్ష్మి, జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి, సిపిఓ అప్పలకొండ, డిఎం అండ్ హెచ్ఓ రామ గిడ్డయ్య,జిల్లా కుష్ఠు,ఎయిడ్స్ మరియు టిబి నివారణ అధికారి డాక్టర్ ఎల్.భాస్కర్,DNMO డాక్టర్ మల్లికార్జున రెడ్డి,హెచ్ఈఓ శివశంకర్,డిప్యూటీ హెచ్ఈఓ దేవ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News