Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: 'స్పందన'కు వినతుల వెల్లువ

Kurnool: ‘స్పందన’కు వినతుల వెల్లువ

కర్నూలు జిల్లా కేంద్రంలోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందనకు జిల్లా నందమూరి నుండి వినతులు వచ్చాయి. వీటిని జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యలు స్వీకరించారు వీటిలో కొన్ని విన్నతులు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామ నివాసి బి. వెంకటేశ్వర్లు, లక్ష్మీపురం గ్రామ పొలిమేరలో సర్వేనెంబర్ 450/B లో ఒక్క ఎకరా మూడు సెంట్లు భూమి కలదు ఇది మా పెద్దల ఆస్తి ఆన్లైన్లో 66 సెంట్లు భూమి మాత్రమే నమోదు చేశారు మిగులు భూమిని కూడా నమోదు చేయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కౌతాళం మండల కేంద్ర నివాసి వై.గురురాజు మా పెద్దల ద్వారా సంక్రమించిన భూమి సర్వేనెంబర్ 306 లో రెండు ఎకరాల 58 సెంట్లు కలదు, ఈ భూమికి పాస్ పుస్తకాలు కూడా కలువు కానీ పొరపాటున శ్రీధర్ పేరు మీద కూడా మా భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు ఇచ్చారు. వాటిని రద్దు చేయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. నందవరం మండలం ఇబ్రహీంపురం గ్రామం నివాసులు బి.గోవిందమ్మ, బి.తోటరాముడు, బి. శంకరమ్మ, మాకు సర్వే నెంబర్156 లో నాలుగు ఎకరాల భూమి కలదు మాకు అడంగల్ లేనందున మాకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు, బ్యాంకు లోన్స్, ఇన్సూరెన్స్ లు రావడం లేదు కావున మాకు అడంగల్ ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. సి.బెలగల్ మండలం యనగండ్ల గ్రామ నివాసి ఎస్.యేసురాజు, మాకు గుండ్రేవుల గ్రామ పొలిమేరలో సర్వేనెంబర్ 376 లో 0.90 సెంట్ల భూమి కలదు,ఆన్లైన్లో సర్వేనెంబర్ 354 గా నమోదైనది ఈ నెంబర్ ను సరి చేయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. వీటిని సంబంధిత అధికారులకు పంపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News