‘జగనన్నకు చెబుదాం’కు సంబంధించి ఇంకా చూడని (Yet to View) ఫిర్యాదులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టరు జవహర్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడ నుండి జగన్ననకు చెబుదాం, వైద్యం, విద్య, స్పందన తదితర అంశాలపై అన్ని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జగన్ననకు చెబుదాంకు సంబంధించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా స్పందన తరహాలో జగనన్నకు చెబుదాం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. అందులో భాగంగా మే 9వ తేది నుంచి మే 24వ తేది వరకు 16,363 జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్ 1902 ద్వారా ఫిర్యాదులు వచ్చాయన్నారు. అందులో 9480 ఫిర్యాదులను సరైన సమయంలో నివృత్తి చేశామని, వాటిలో ఇంకా 6883 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉన్నాయన్నారు. జగన్నకు చెబుదాం ద్వారా వచ్చిన ఫిర్యాదులను అసలు చూడనివి ఉండకుండా కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. అదే విధంగా ఈ ఫిర్యాదులలో ఎక్కువ శాతం పోలీసు విభాగానికి సంబంధించి పెండింగ్ ఉన్నాయని వారు ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలన్నారు. వైద్యానికి సంబంధించి ఏఎన్ఎం ఫీడ్ బ్యాక్ రిపోర్ట్ పెండింగ్ ఉన్నవి పూర్తి చేయాలన్నారు. ఎన్సిడి (సంక్రమించని వ్యాధులు) సర్వేకు సంబంధించి ఎంఎల్హెచ్పిలు, ఏఎన్ఎం కెవైసి జూలై 31వ తేది లోపు పూర్తి చేయాలన్నారు. ఎన్సిడి అనుమానిత కేసులైన హైపర్టెన్షన్, డయాబిటీస్ కు సంబంధించి వైద్యాధికారులు పరిశీలించి జూన్ 15వ తేది నాటికి పూర్తి చేయించడంతో పాటు ఫ్యామిలీ ఫిజిషియన్ ద్వారా పరీక్షలు నిర్వహించేలా చూడాలన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఐరన్ సుక్రోజ్, రక్త మార్పిడి చేసేందుకు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా వారిని అనుసంధానం చేయడం జరిగిందన్నారు. అవ్వాతాతల కంటి వెలుగులో భాగంగా వారికి పూర్తి స్థాయిలో అవసరం ఉన్న వారికి కాట్రాక్ట్ సర్జరీలు, కంటి అద్దాలను అందించేలా చూడాలన్నారు. అదే విధంగా వైద్య శాఖలో పెండింగ్ ఉన్న పోస్టుల జూన్ 15లోపు భర్తీ చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. 15వ ఫైనాన్స్ కమీషన్ నిధులతో నిర్మిస్తున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ నిర్మించేందుకు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను గుర్తించి టెండర్ ప్రక్రియ జూన్ 15వ తేది నాటికి పూర్తి చేసేలా చూడాలన్నారు. కొవిడ్ హెచ్ఆర్, నాన్ హెచ్ఆర్ బడ్జెట్ కు సంబంధించిన ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్లు ఫైనల్ చేసి పంపాలన్నారు. టీచింగ్ హాస్పిటల్స్ నందు మధ్యాహ్నం ఓపి 3గం.ల నుంచి సా.4గం.ల వరకు ఏర్పాటు చేయడం జరిగిందని తగు సమయాల్లో కలెక్టర్లు ఆసుపత్రులను పరిశీలించి పేషంట్స్ కు మెరుగైన వైద్యం అందించేలా వైద్యులను కలెక్టర్లు ప్రోతహించాలన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా అందిస్తున్న వైద్య సేవల శాతాన్ని ఇంకా పెంచడానికి గాను కలెక్టర్లు కృషి చేయాలన్నారు. నాన్ పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టేలా చూడాలన్నారు. అంగన్వాడీ హెల్పెర్స్, వర్కర్స్ నియామకం మీద దృష్టి పెట్టాలన్నారు. చిన్నారులు బరువు తక్కువగా ఉండకుండా, ఎదుగుదల లోపం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు అందజేదనున్న జగనన్న విద్యా కానుకకు సంబంధించి ప్రతి పాఠశాల దగ్గర క్వాలిటీ వాల్ ను ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 12వ తేది నాటికి విద్యా కానుకకు సంబంధించిన వస్తువులు ప్రతి ఒక్క పిల్లవాడికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను ఇంజనీరింగ్ అసిస్టెంట్ పరిశీలిస్తూ అందుకు అవసరమైన ఎక్స్పెన్డిచర్ ను బుక్ చేయడంతో పాటు స్టేజ్ కన్వర్షన్ మీద దృష్టి పెట్టాలన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలలో తప్పిన వారు రేమిడియల్ క్లాసులకు హాజరు అయి తప్పకుండా ఉత్తీర్ణత సాధించాలన్నారు. స్పందన అర్జీలను బియాండ్ ఎస్ఎల్ఎ ఉండకుండా పూర్తి చేయడంతో పాటు రీఓపెన్ అయిన అర్జీలకు సరైన ఎండార్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేసేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సిఎస్ ను ఆదేశించారు. ఏపిపిఎస్సీ గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి జూన్ 3వ తేది నుంచి 10వ తేది వరకు పరీక్షలు నిర్వహించనున్నారని, 6455 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని, అందుకుగాను చీఫ్ సూపరింటెండంట్లు, లైజన్ అధికారులు పరీక్ష కేంద్రాలను పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు. ప్రశ్న పత్రాలను భద్రపరచుకోవడానికి గాను స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించి జూన్ 1వ తేది నాటికి వచ్చే ప్రశ్న పత్రాలను అందులో భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత సిబ్బందితో సమావేశాలు నిర్వహించి పరీక్ష నిర్వహణలో ఎటువంటి లోటు పాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సెల్ ఫోన్ డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థులను పూర్తి స్థాయిలో పరిశీలించి పరీక్ష కేంద్రంలోనికి అనుమతించాలన్నారు. కొవిడ్ వల్ల చనిపోయిన ఉద్యోగస్తుల వివరాలను మే 31వ తేదిలోపు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జగనన్నకు చెబుదాంకు సంబంధించి ఇంకా చూడని (Yet to View) ఫిర్యాదులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టరు జవహర్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విజయవాడ నుండి జగన్ననకు చెబుదాం, వైద్యం, విద్య, స్పందన తదితర అంశాలపై అన్ని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జగన్ననకు చెబుదాంకు సంబంధించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్పందన తరహాలో జగనన్నకు చెబుదాం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా మే 9వ తేది నుంచి మే 24వ తేది వరకు 16,363 జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్ 1902 ద్వారా ఫిర్యాదులు వచ్చాయన్నారు. అందులో 9480 ఫిర్యాదులను సరైన సమయంలో నివృత్తి చేశామని, వాటిలో ఇంకా 6883 ఫిర్యాదులు పరిష్కార దశలో ఉన్నాయన్నారు. జగన్నకు చెబుదాం ద్వారా వచ్చిన ఫిర్యాదులను అసలు చూడనివి ఉండకుండా కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. అదే విధంగా ఈ ఫిర్యాదులలో ఎక్కువ శాతం పోలీసు విభాగానికి సంబంధించి పెండింగ్ ఉన్నాయని వారు ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలన్నారు. వైద్యానికి సంబంధించి ఏఎన్ఎం ఫీడ్ బ్యాక్ రిపోర్ట్ పెండింగ్ ఉన్నవి పూర్తి చేయాలన్నారు. ఎన్సిడి (సంక్రమించని వ్యాధులు) సర్వేకు సంబంధించి ఎంఎల్హెచ్పిలు, ఏఎన్ఎం కెవైసి జూలై 31వ తేది లోపు పూర్తి చేయాలన్నారు. ఎన్సిడి అనుమానిత కేసులైన హైపర్టెన్షన్, డయాబిటీస్ కు సంబంధించి వైద్యాధికారులు పరిశీలించి జూన్ 15వ తేది నాటికి పూర్తి చేయించడంతో పాటు ఫ్యామిలీ ఫిజిషియన్ ద్వారా పరీక్షలు నిర్వహించేలా చూడాలన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఐరన్ సుక్రోజ్, రక్త మార్పిడి చేసేందుకు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా వారిని అనుసంధానం చేయడం జరిగిందన్నారు. అవ్వాతాతల కంటి వెలుగులో భాగంగా వారికి పూర్తి స్థాయిలో అవసరం ఉన్న వారికి కాట్రాక్ట్ సర్జరీలు, కంటి అద్దాలను అందించేలా చూడాలన్నారు. అదే విధంగా వైద్య శాఖలో పెండింగ్ ఉన్న పోస్టుల జూన్ 15లోపు భర్తీ చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. 15వ ఫైనాన్స్ కమీషన్ నిధులతో నిర్మిస్తున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్ నిర్మించేందుకు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలను గుర్తించి టెండర్ ప్రక్రియ జూన్ 15వ తేది నాటికి పూర్తి చేసేలా చూడాలన్నారు. కొవిడ్ హెచ్ఆర్, నాన్ హెచ్ఆర్ బడ్జెట్ కు సంబంధించిన ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్లు ఫైనల్ చేసి పంపాలన్నారు. టీచింగ్ హాస్పిటల్స్ నందు మధ్యాహ్నం ఓపి 3గం.ల నుంచి సా.4గం.ల వరకు ఏర్పాటు చేయడం జరిగిందని తగు సమయాల్లో కలెక్టర్లు ఆసుపత్రులను పరిశీలించి పేషంట్స్ కు మెరుగైన వైద్యం అందించేలా వైద్యులను కలెక్టర్లు ప్రోతహించాలన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా అందిస్తున్న వైద్య సేవల శాతాన్ని ఇంకా పెంచడానికి గాను కలెక్టర్లు కృషి చేయాలన్నారు. నాన్ పారామెడికల్ సిబ్బంది నియామకం చేపట్టేలా చూడాలన్నారు. అంగన్వాడీ హెల్పెర్స్, వర్కర్స్ నియామకం మీద దృష్టి పెట్టాలన్నారు. చిన్నారులు బరువు తక్కువగా ఉండకుండా, ఎదుగుదల లోపం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు అందజేదనున్న జగనన్న విద్యా కానుకకు సంబంధించి ప్రతి పాఠశాల దగ్గర క్వాలిటీ వాల్ ను ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 12వ తేది నాటికి విద్యా కానుకకు సంబంధించిన వస్తువులు ప్రతి ఒక్క పిల్లవాడికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను ఇంజనీరింగ్ అసిస్టెంట్ పరిశీలిస్తూ అందుకు అవసరమైన ఎక్స్పెన్డిచర్ ను బుక్ చేయడంతో పాటు స్టేజ్ కన్వర్షన్ మీద దృష్టి పెట్టాలన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలలో తప్పిన వారు రేమిడియల్ క్లాసులకు హాజరు అయి తప్పకుండా ఉత్తీర్ణత సాధించాలన్నారు. స్పందన అర్జీలను బియాండ్ ఎస్ఎల్ఎ ఉండకుండా పూర్తి చేయడంతో పాటు రీఓపెన్ అయిన అర్జీలకు సరైన ఎండార్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేసేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సిఎస్ ను ఆదేశించారు. ఏపిపిఎస్సీ గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి జూన్ 3వ తేది నుంచి 10వ తేది వరకు పరీక్షలు నిర్వహించనున్నారని, 6455 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని, అందుకుగాను చీఫ్ సూపరింటెండంట్లు, లైజన్ అధికారులు పరీక్ష కేంద్రాలను పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు. ప్రశ్న పత్రాలను భద్రపరచుకోవడానికి గాను స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించి జూన్ 1వ తేది నాటికి వచ్చే ప్రశ్న పత్రాలను అందులో భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత సిబ్బందితో సమావేశాలు నిర్వహించి పరీక్ష నిర్వహణలో ఎటువంటి లోటు పాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సెల్ ఫోన్ డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థులను పూర్తి స్థాయిలో పరిశీలించి పరీక్ష కేంద్రంలోనికి అనుమతించాలన్నారు. కొవిడ్ వల్ల చనిపోయిన ఉద్యోగస్తుల వివరాలను మే 31వ తేదిలోపు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.