Monday, December 9, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: గాడి తప్పిన వర్శిటీ, ఆందోళనలో విద్యార్థులు

Kurnool: గాడి తప్పిన వర్శిటీ, ఆందోళనలో విద్యార్థులు

అంతా అయోమయం..

రాయలసీమ యూనివర్సిటీలో పాలన పడకేసింది. రోజుకో కుంభకోణం, అక్రమాలు, ప్రొఫెసర్ల కుమ్ములాటలు వెలుగులోకి రావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

అభివృద్ధికి అడ్డుగోడలుగా..

ఇంచార్జ్ వీసీ, షాడో వీసీగా ఆరోపణలున్న టైం స్కేల్ ఉద్యోగి కలిసి తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలు వర్సిటీ అభివృద్ధికి అడ్డుగోడలుగా నిలుస్తూ వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ప్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చెందుతున్నారు. వీరి వేధింపులు తారాస్థాయికి చేరాయి. రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు, విద్యార్థులు ఇలా ఒకరేమిటి వరుస పెట్టీ ఎవరిని వదలకుండా వేధింపులకు గురిచేస్తుండడంతో కొందరు అధికారులు సెలవుపై వెళ్లే పరిస్థితికి దిగజారింది. దొంగ బిల్లులు, కాకి లెక్కలతో నిధులు గోల్మాల్ చేసేందుకు వత్తాసు పలకాలని ఫైనాన్స్ అధికారి పై ఒత్తిడి చేయడంతో సెలవులో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

ఓ ఫైనాన్స్ అధికారి సెలవులో వెళ్ళగా మరీ కొందరు ప్రొఫెసర్లు విధులకు దూరంగా ఉంటూ క్యాంపస్ లో సంతకాలు పెట్టి తమ కేటాయించిన విధులకు వెళ్లకుండా చెట్ల కింద కాలక్షేపం చేస్తూ తరగతులకు దూరంగా ఉంటున్నట్లు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. ఫలితంగా తరగతి గదిలో విద్యార్థులకు బోధించేందుకు ప్రొఫెసర్లు , అధ్యాపకులు లేకపోవడంతో ఈ ఏడాది అడ్మిషన్లు లేక పలు విభాగాల్లో విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. వర్సిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు దిగజారడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాలపై ఉన్నత విద్యా మండలి, అధికారులు, పాలకులు, ప్రజా ప్రతినిధులు దృష్టిసారించి అడ్డుకట్ట వేయకపోతే యూనివర్సిటీ మనుగడకే ప్రమాద గంటికలు మోగాయని చెప్పక తప్పదు.

సెలవులో కాదు గవర్నమెంట్ పని మీదే..ఆర్ యు రిజిస్టార్ బోయ విజయ్ కుమార్ నాయుడు

“వర్సిటీ ఫైనాన్స్ అధికారిపై వేధింపులు అనుకుంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగత సెలవుల్లో కాదు గవర్నమెంట్ పని మీదే వెళ్ళాడు, వర్సిటీలో ఎటువంటి వేధింపులు లేవు, డైరెక్టర్ ఆఫ్ ఆడిటర్ లో పనిచేస్తూ డిప్యూటేషన్ పై ఇక్కడకు వచ్చాడు. గుంటూరు విజయవాడ స్కిల్ డెవలప్మెంట్లో ఆసక్తి పై అక్కడికి వెళ్ళాడ”న్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News