Cyclone Mandous: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడి తర్వాత తీవ్ర వాయుగుండం.. ఆ తర్వాత తుఫాన్ గా మారింది. ఈ తుఫాన్ కు మాండూస్ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. తుపానుగా మారిన వాయుగుండం తీరం దాటింది. రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది. శనివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా యి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ మైపాడు తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 50 మీటర్లకు పైగా ముందుకురావడంతో.. అలలు బీచ్ వద్ద దుకాణాలను తాకుతున్నాయి.
పెన్నా పరివాహక ప్రాంతాలైన అనంతసాగరం, చేజర్ల, ఆత్మ కూరు, సంగం మండలాల అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. తుఫాను తీరం దాటినప్పటికీ మరో రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు. వాయుగుండం ప్రభావంతో ఈదురుగాలులు అల్లకల్లోలం సృష్టిస్తాయని వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ వెల్లడించింది.