కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు(Mahanadu) ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, డాక్టర్ నందమూరి తారకరామారావు(NTR) 102వ జయంతి సందర్భంగా సభా వేదికపై ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు, ఇతర నాయకులు నివాళులర్పించారు. అనంతరం మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది.
“మహా వేడుకలా.. నింగి నేలా పసుపు మయమై పరవశించేలా.. అంగరంగ వైభవంగా జరుగుతోన్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు.. ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశవిదేశాల్లో తెలుగు కీర్తిపతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు, వివిధ రంగాలలో తమ ప్రతిభాపాటవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక, సాంకేతిక, సాహిత్మ నీరాజనం ఇచ్చేన కళాకారులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు, విజ్ఞులకు, ముఖ్యంగా నా పసుపు జెండాను గుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి.
సరిగ్గా 43 ఏళ్లు అయ్యింది నా తెలుగువారి కోసం.. నా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం.. తెలుగుదేశం పార్టీని స్థాపించి.. నేను స్థాపించాను అనేకంటే.. పుట్టిందని చెప్పడమే సరైంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన పథకాలు, జరిగిన అభివృద్ధి.. నాడు ప్రారంభించిన పథకాలు.. నేడు చంద్రబాబు నేతృత్వంలో రూపుదిద్దుకున్న సంక్షేమ పథకాలు చిరస్మరణీయ. మానవసేవలో పార్టీ కార్యకర్తలు, సామాన్యులకు అండగా ఉంటున్న నా మనవడు లోకేష్‌ని చూస్తుంటే ముచ్చటేస్తోంది.. భళా మనవడా.. భళా అంటూ..” ఎన్టీఆర్ తన ప్రసంగం ముగించారు.