Sarva Darshan: తిరుమలకు భక్తులు పోటెత్తారు. కలియుగ దైవమైన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో సాధారణ భక్తుల రద్దీ కంటే ఎక్కువగా ఉంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు కిక్కిరిసిపోయాయి. దీంతో ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు లైన్‌లో వేచి ఉన్నారు.
దర్శన సమయాల వివరాలు: శనివారం ఉదయం 8 గంటల సమయానికి ఉచిత దర్శనం కోసం కంపార్టుమెంట్లన్నీ భక్తులతో ఫుల్ అయిపోయాయి. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి దర్శనం కోసం 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. రూ. 300ల శీఘ్ర దర్శనం కోసం 3 నుండి 5 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఉన్న వారికి ఆహార, పానీయాలు నిరంతరం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also read-Mukesh Ambani: శ్రీవారి సేవలో ముకేశ్ అంబానీ.. కుటుంబంతో కలిసి తిరుమల దర్శనం
రూ. 4.64 కోట్ల ఆదాయం: శుక్రవారం తిరుమలలో భక్తుల తాకిడి రికార్డు స్థాయిలో నమోదైంది. మొత్తం74,636 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని 43,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారికి రికార్డు స్థాయిలో రూ. 4.64 కోట్ల ఆదాయం సమకూరింది. నిన్న మొత్తం 4.21 లక్షల లడ్డూలను విక్రయించిట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

