Visakha Medicover LDR Unit: ప్రస్తుత కాలంలో గర్భిణీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హైరిస్క్ ప్రసవాలు. ఇకపై అలాంటి సమస్యలను అత్యంత జాగ్రత్తగా పరిష్కరించేందుకు విశాఖ ‘మెడికవర్’ ఆస్పత్రి.. అత్యాధునిక లేబర్, డెలివరీ యూనిట్‌ను ప్రారంభించింది.
విశాఖలోని ఎంవీపీ కాలనీలో మెడికవర్ ఆస్పత్రి మహిళా, శిశు విభాగంలో కొత్తగా ‘ఎల్‌డీఆర్’ యూనిట్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక లేబర్, డెలివరీ యూనిట్‌ను ప్రారంభించినట్లు మెడికవర్ వైద్యులు పేర్కొన్నారు. ప్రసూతి గదులు, న్యూబోర్న్ ఐసీయూ, ఆధునిక మానిటరింగ్ సిస్టంతో పాటు నిపుణులైన వైద్యులు, 24గంటల పాటు నర్సింగ్ సేవలూ ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
‘మెడికవర్’ ఆస్పత్రిలో LDR ద్వారా హైరిస్క్ గర్భధారణ, పెయిన్‌లెస్ లేబర్ ప్రక్రియల్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తామని డాక్టర్లు పేర్కొన్నారు. ఎల్‌డీఆర్ ద్వారా కేవలం ఆధునిక వసతులను అందుబాటులోకి తీసుకురావడం మాత్రమే కాకుండా తల్లులు, శిశువులకు భద్రత, గౌరవం, నాణ్యమైన వైద్య సేవల్ని నిబద్ధతతో అందిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మెడికవర్ ఎంవీపీ సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్, గైనకాలజిస్టులు డా. కిరణ్మయి, డా. లక్ష్మీ కొండమ్మ, డా. శాంతి, డా. తనుజా ప్రియదర్శిని, డా. వినీల, పీడియాట్రిషన్, నియోనాటాలజిస్టులు డా. సాయి సునీల్ కిశోర్, డా. కేటీవీ లక్ష్మణ్, డా. మానస, డా. ప్రియాంక, అనస్థీషియాలజిస్ట్ డా. రాజశేఖర్ పాల్గొన్నారు.


