Thursday, December 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Leopard: గన్నవరం రైతు పొలంలో చిరుత మృతి

Leopard: గన్నవరం రైతు పొలంలో చిరుత మృతి

కృష్ణా జిల్లాలో రైతు పొలంలో చిరుతపులి(Leopard) మృతి తీవ్ర కలకలం రేపింది. గన్నవరం(Gannavaram) మండలం మెట్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట పొలాన్ని అడవి పందుల బెడద నుంచి రక్షించుకునేందుకు ఉచ్చు ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి చెందింది. ఇది చూసిన రైతులు, స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

- Advertisement -

సమాచారం అందుకున్న అటవీ, పోలీసు శాఖల అధికారులు ఘటనాస్థలికి చేరుకొని చిరుత కళేబరాన్ని పరిశీలించారు. చిరుత చిక్కడంతో చుట్టుపక్కల గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని చిరుతపులుల ఉన్నాయేమోనని భయాందోళనకు గురవుతున్నారు. అయితే వన్యప్రాణుల రక్షణతో పాటు ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News