Saturday, February 22, 2025
Homeఆంధ్రప్రదేశ్Lepakshi: లేపాక్షీ షోరూముల ఫేస్ లిఫ్ట్

Lepakshi: లేపాక్షీ షోరూముల ఫేస్ లిఫ్ట్

తెలుగుదనం, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపట్టేలా లేపాక్షి నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏవీ)తో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీహెచ్డీసీ) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్. సవిత సమక్షంలో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ ఎండీ విశ్వ, ఎస్పీఏవీ డైరెక్టర్ ఎస్.రమేష్ శుక్రవారం ఎంవోయూపై సంతకాలు చేశారు.

- Advertisement -

ఆకట్టుకునేలా షో రూములు

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లేపాక్షి షో రూమ్ లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంపద్రాయాలను ఉట్టిపట్టేలా ఆకర్షణీయంగా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లేపాక్షి షోరూమ్ లకు మరమ్మతులు చేపట్టి, ఆకర్షణీయమైన ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టానున్నారు. షో రూమ్ ల బయట, లోపల కూడా మరమ్మతులు చేపట్టనున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా షోరూమ్ లను రూపొందించడం వల్ల వివిధ కళా రూపాల అమ్మకాలు పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ఏపీలోని పలు ప్రాంతాల సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే వీలుకలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏవీ)తో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీహెచ్డీసీ) ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత సమక్షంలో ఎంవోయూపై ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ ఎండీ విశ్వ, ఎస్పీఏవీ డైరెక్టర్ ఎస్.రమేష్ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం మూడేళ్లు అమలులో ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఏపీహెచ్డీసీ, ఎస్పీఏవీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News