AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గవర్నమెంట్ వైన్ షాపుల్లో పర్మిట్ రూములు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గమనించి, దీనిపై సమగ్ర అధ్యయనం చేసి నివేదకి ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మద్యాన్ని నియంత్రిత వినియోగ ప్రోత్సాహానికి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కమిటీ నివేదిక ఆధారంగా..
మద్యం షాపుల్లో పర్మిట్ రూములు ఏర్పాటు చేయడం వల్ల నిర్మానుష ప్రాంతాల్లో మద్యం సేవించే సంస్కృతిని అరికట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. పర్మిట్ రూముల కోసం ఏర్పాటు చేసిన కమిటీ పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మద్యం షాపుల విధానాలను పరిశీలించి, అక్కడి విధాలను పరిశీలించి.. కొన్ని పేజీల నివేదిక సమర్పిస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పర్మిట్ రూములను సిద్ధం చేస్తారు.
ఆన్‌లైన్‌లో మద్యం కొనుగోళ్లకు ప్రోత్సాహం
రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం మద్యం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే వ్యవస్థను కూడా ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా నకిలీ మద్యం, లిక్కర్ అక్రమ రవాణా సమస్యలను ఎదుర్కొనడంలో ఇది ఉపయోగకరంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం ఆమోదం పొందిన వెంటనే మద్యం వినియోగాన్ని నియంత్రించడంతో పాట భద్రతతో కూడిని సేవలను అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు.


