Tuesday, February 11, 2025
Homeఆంధ్రప్రదేశ్liquor rates: బాటిళ్ల గరిష్ట ధర పెంపు పై స్పష్టత ఇచ్చిన ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్...

liquor rates: బాటిళ్ల గరిష్ట ధర పెంపు పై స్పష్టత ఇచ్చిన ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్

- Advertisement -

మద్యం బాటిళ్ల గరిష్ట ధర పెంపు పై స్పష్టత ఇచ్చారు ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్. మద్యం బాటిళ్ల ధర పెంపు గురించి వస్తున్న సమాచారంపై పుల్ క్లారిటీ ఇచ్చారు. అసలు ధర పెంపు కేవలం రూ.10 మాత్రమే అని ఆయన తెలిపారు. అలాగే, బ్రాండ్ లేదా పరిమాణం (క్వార్టర్/హాఫ్/ఫుల్ బాటిల్) అనే దానితో సంబంధం లేకుండా, అన్ని బాటిళ్లపై 10 రూపాయలు మాత్రమే పెరిగిందని స్పష్టం చేశారు.

కొంతమంది రూ.15 లేదా రూ. 20 పెరిగిందని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని అన్నారు. అది నిజం కాదని తెలిపారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని అపోహలకు గురి కాకూడదని విజ్ఞప్తి చేశారు. తాజా ధరల వివరాలను అన్ని షాపుల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.

బీరు, రూ 99 మద్యం సీసాలపై ఎటువంటి పెంపు లేదన్నారు. అన్ని రకాల మద్యంపై 15% మేరా ధరలు పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్ ను 14.5 నుంచి 20 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో ధరల పెంపు అనివార్యమైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇకపై మూడు కేటగిరీలుగా (ఇండియన్ మేడ్, ఫారిన్ మేడ్, బీర్) మద్యం సరఫరా ఉంటుందని తెలిపాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News