Tuesday, December 9, 2025
HomeTop StoriesAP Liquor Scam: ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం.. చెవిరెడ్డి ఆస్తులు జప్తునకు ప్రభుత్వం...

AP Liquor Scam: ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం.. చెవిరెడ్డి ఆస్తులు జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు

liquor scam probe govt approves attachment properties chevireddy family: ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తులు జప్తుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారులు మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చింది. కేవీఎస్‌ ఇన్‌ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా, కమీషన్ల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఇటీవల సిట్‌ గుర్తించింది. రూ.54.87 కోట్లను నల్లధనంగా మార్చినట్లు నిగ్గు తేల్చింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. అధికారం అండతో మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్లు నిర్థారించింది. అవినీతి నిరోధక, నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జప్తునకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. సిట్‌ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

రూ.54.87 కోట్ల ఆస్తి జప్తుకు ఆదేశాలు..

చెవిరెడ్డి కుటుంబానికి సంబంధించిన నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్ట్రరైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం ఆదేశించింది. చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిందితుడు చెవిరెడ్డి కుటుంబం పేర్లతో రిజిస్ట్రేషన్ అయినట్లు సిట్ గుర్తించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెవిరెడ్డి కుటుంబం మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్లు సిట్ నిర్ధారించింది. వెండోడులోని అరబిందో ఫార్మాకు కేవీఎస్ ఇన్‌ఫ్రా ద్వారా 263.28 ఎకరాల భూమి కొనుగోలు, అమ్మకంలో మోసం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. తక్కువ సమయంలోనే భూమి విలువలను అసాధారణంగా పెంచి నల్లధనాన్ని తెల్లగా మార్చారని సిట్ నివేదించింది. ఈ లావాదేవీల ద్వారానే కేవీఎస్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ.13.3 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారని తేల్చింది. మద్యం కుంభకోణం నుంచి కమిషన్లు, కిక్ బ్యాక్‌లతో చెవిరెడ్డి కుటుంబం భారీగా స్థిర, చర ఆస్తులను కూడబెట్టారని దర్యాప్తులో బయటపడింది. అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ లా లోని పలు సెక్షన్ల ప్రకారం అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని ప్రభుత్వాన్ని సిట్ కోరింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News