ఇది ప్రజాప్రభుత్వం – 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బంగారుపాళ్యంలో నిర్వహిస్తున్న ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనున్న విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్.
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడం భాగంగా…
రాష్ట్ర మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బంగారుపాలెం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు.
దీనితో పాటు రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను, నూతనంగా నిర్మించిన ఔట్ పేషెంట్ విభాగం ప్రారంభించారు.
డయాలసిస్ పేషంట్లతో మంత్రివర్యులు మాట్లాడి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసు కుంటున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద రావు,సెకండరీ హెల్త్ డైరెక్టర్ సిరి,జిల్లా కలెక్టర్ సుమిత కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జే సి జి. విద్యాధరి,ఎం ఎల్ సి కంచర్ల శ్రీకాంత్,పూతలపట్టు, పలమనేరు,నగరి,చంద్రగిరి శాసన సభ్యులు కె.మురళి మోహన్,ఎన్.అమరనాథ్ రెడ్డి,జి. భాను ప్రకాష్, పులివర్తి నాని,అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.