Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Lokesh @ Nandikotkuru: సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర

Lokesh @ Nandikotkuru: సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర

యువగళం పాదయాత్రలో భాగంగా నందికొట్కూరు నారా లోకేష్ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన లోకేష్ తమను అధికారంలోకి తెస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపుతామన్నారు. నందికొట్కూరు నాటు దెబ్బ అదుర్స్. మీ దెబ్బకి జగన్ దిమ్మతిరిగిపోతుంది అంటూ ఆకట్టుకునేలా లోకేష్ ప్రసంగం సాగింది. సప్తనదుల సంగమం సంగమేశ్వర ఆలయం, సరస్వతి దేవాలయం కొలనుభారతిదేవి క్షేత్రం, శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి ఈ నందికొట్కూరు అంటూ లోకేష్ ప్రసంగంతో స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

- Advertisement -


రాయలసీమకు తాగు, సాగునీరు అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు పుట్టినిల్లు నందికొట్కూరు నియోజకవర్గమన్న లోకేష్.. ఎంతో చరిత్ర ఉన్న నందికొట్కూరు నియోజకవర్గంలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం అన్నారు. యువగళం…మనగళం…ప్రజాగళం అంటూ యువగళం పాదయాత్ర దెబ్బకి వైసిపి దొంగల బ్యాచ్ అంతా రోడ్డు మీదకి వస్తోందన్నారు. నేను ముందే చెప్పా అన్న లోకేష్.. అడ్డుకోవడానికి ఎంత మంది వచ్చినా మేము రెడీ…తన్నులు తినడానికి మీరు రెడీనా? అంటూ సవాలు విసిరారు. సాగనిస్తే పాదయాత్ర… అడ్డుకుంటే దండయాత్ర అంటూ లోకేష్ హెచ్చరించారు.
2019 లో 14 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు వైసిపి కి ఇచ్చారని, ఉమ్మడి కర్నూలు జిల్లాకి వైసిపి పీకింది ఏంటి? 16 మంది రండి నేను చర్చకు రెడీ. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా? అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించి, చంద్రన్నను సిఎం చేసేందుకు సహకరించండి. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు లోకేష్.

నందికొట్కూరులో తాపీ వర్కర్స్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. నందికొట్కూరు సుంకాలమ్మ దేవాలయం వద్ద డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News