Sunday, September 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Lokesh: మాది సాయగుణం, మీది దోపిడీ సిద్ధాంతం

Lokesh: మాది సాయగుణం, మీది దోపిడీ సిద్ధాంతం

కష్టాల్లో ఉన్నవాడు శత్రువైనా సరే ఆపన్నహస్తం అందించాలన్న సాయగుణం తెలుగుదేశం పార్టీ బ్లడ్ లోనే ఉందని, దోపిడీ చేయడమే జగన్ సిద్ధాంతమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో వెలుగోడు బ్యాలన్సింగ్ రిజర్వాయర్ లోకేష్ పరిశీలించారు. చెన్నై వరకు వెళ్లే తెలుగుగంగ ప్రధాన కాల్వ ఇది అని రాష్ట్రంలో ఎడారి ప్రాంతాన్ని తలపించే రాయలసీమకు సాగునీటితో పాటు పొరుగున ఉన్న తమిళ సోదరులకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అన్న ఎన్టీఆర్ 1983లో తెలుగుగంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే… చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలో 1996 సెప్టెంబర్ 23న ఇక్కడ నుంచి తొలిసారిగా నీళ్లు తమిళనాడులోకి ప్రవేశించాయని, దీని ద్వారా రాయలసీమలోని 1.75లక్షల ఎకరాలకు సాగునీరు, చెన్నై ప్రజలకు తాగునీరు అందుతోంది అని లోకేష్ అన్నారు. సొంత లాభం కొంతమానుకు… పొరుగువారికి తోడుపడవోయ్ అన్న సిద్ధాంతం మాదైతే… ఆస్తుల కోసం సొంత తల్లి, చెల్లిని పొరుగు రాష్ట్రానికి తరిమేసి, గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే సిద్ధాంతం జగన్ రెడ్డిది అని లోకేష్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News