Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Lokesh Pawan: పవన్ ఛాలెంజ్‌కు లోకేశ్ సై.. ఒక్కొక్కటి కాదు ఏకంగా కోటి!!

Lokesh Pawan: పవన్ ఛాలెంజ్‌కు లోకేశ్ సై.. ఒక్కొక్కటి కాదు ఏకంగా కోటి!!

Lokesh Pawan: ఆంధ్ర రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విద్యాశాఖ ముందుకొచ్చింది. ఆ శాఖ ఆధ్వర్యంలో ఏకంగా కోటి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో ఎందరో స్ఫూర్తిని పొంది వేలాది మొక్కలు నాటుతున్న వేళ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పుడు అదే సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

గురువారం శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువులోని జిల్లాలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగిన సంగతి విధితమే. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని మన ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు సవాల్ విసిరారు. ఇప్పుడదే సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. మన విద్యాశాఖ ద్వారానే ఆ కోటి మొక్కలు నాటి చూపిస్తామ”ని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా..

ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. విద్యార్థులకు చదువు మాత్రమే కాకుండా ఆటలు, పాటలు, యోగా వంటి వాటిలో శిక్షణ కూడా ఇస్తున్నామని వివరించారు. అయితే విద్యార్థుల ఎదుగుదలలో టీచర్స్ పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. తల్లిదండ్రుల తర్వాత అంత స్థానం వాళ్లదే అని లోకేశ్ కొనియాడారు. పాఠశాలల్లో ఎలాంటి రాజకీయాలకు తావు ఉండకూడదని.. భావితరాల భవిష్యత్తే తమకు ఎంతో ముఖ్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad