Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Thirumala: నాగుల చవితి: పెద శేష వాహనంపై శ్రీవారి దివ్య దర్శనం

Thirumala: నాగుల చవితి: పెద శేష వాహనంపై శ్రీవారి దివ్య దర్శనం

Pedda Sesha Vahanam: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి వైభవోపేతంగా పెద శేష వాహన సేవ జరిగింది. సకల జగత్ పాలకుడైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అలంకరించిన పెద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి వేలాది మంది భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి మొదలైన ఈ ఊరేగింపులో భక్తులు గోవింద నామస్మరణతో పులకించిపోయారు.

- Advertisement -

ఈ శేష వాహన సేవకు పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత ఉంది. సర్పరాజైన ఆదిశేషుడు నిత్యసూరులలో ఆద్యుడు, స్వామివారికి అత్యంత ప్రియ భక్తుడు. శ్రీమహావిష్ణువుకు శేషుడే నివాస భూమిగా (శేషాద్రి), తల్పంగా, సింహాసనంగా, ఛత్రంగా సేవలందిస్తాడు. శ్రీవేంకటేశ్వరుడు కూడా సహస్రనామాలలో ‘శేషశాయి’, ‘శేషాద్రి నిలయం’ అంటూ ఆదిశేషునితో నిత్య పూజలు అందుకుంటున్నారు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆదిశేషువు.. దాసభక్తికి, స్వామికి చేసిన పరిచర్యలకు మారు రూపంగా నిలుస్తాడు.

బ్రహ్మోత్సవాలలో స్వామివారు తొలి ప్రాధాన్యతను పెద శేష వాహనానికే ఇవ్వడం ద్వారా.. శరణాగతి ప్రపత్తిని, సేవ యొక్క గొప్పదనాన్ని భక్తులకు సాక్షాత్కరింపజేస్తున్నారు. అపార భక్తి, శరణాగతి ద్వారానే మోక్షం సిద్ధిస్తుందని ఈ వాహన సేవ సందేశాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌, టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, వీజీవో సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad