Thursday, March 12, 2026
Homeఆంధ్రప్రదేశ్AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వానలు..?

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వానలు..?

Low Pressure: దక్షిణ బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇది బుధవారం నాటికి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ దశలో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారవచ్చని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యక్ష ప్రభావం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

శ్రీలంకతో పాటు తమిళనాడులో…

అయితే ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావం శ్రీలంకతో పాటు తమిళనాడులో కనిపించే అవకాశముంది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఏపీపై ఈ అల్పపీడనం ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై పూర్తి స్పష్టత వచ్చే రెండు రోజుల్లో లభిస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/andhra-pradesh-assembly-resumes-budget-discussion/

బంగాళాఖాతంలో అల్పపీడనాలు..

ఫిబ్రవరి నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు లేదా తుఫాన్లు ఏర్పడటం సాధారణం కాదు. చరిత్రాత్మక రికార్డుల ప్రకారం 1891 నుంచి 2024 వరకు ఈ నెలలో కేవలం ఏడు తుఫాన్లు లేదా వాయుగుండాలు మాత్రమే నమోదయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అల్పపీడనం ఏర్పడినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నెల 19వ తేదీ తర్వాత ఆవర్తనం లేదా మరో అల్పపీడనం ఏర్పడవచ్చని సమాచారం. అది రూపుదిద్దుకుంటే తమిళనాడు, దక్షిణ కోస్తా ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు …

ఇంకొక వైపు కోస్తా జిల్లాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు పలు ప్రాంతాల్లో మబ్బు తీవ్రంగా కనిపించింది. విజయవాడ పరిసరాల్లో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సోమవారం బిల్ గేట్స్ వచ్చిన విమానం ల్యాండింగ్ సమయంలో కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టి తర్వాత సురక్షితంగా దిగింది.

Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/ap-govt-renames-revenue-junior-assistant-posts/

కోస్తా ప్రాంతాల్లో పొగమంచు…

మంగళవారం కూడా ఉత్తరాంధ్రతో పాటు కోస్తా ప్రాంతాల్లో పొగమంచు కొనసాగింది. ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం కర్నూలులో గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. చలి తగ్గి ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 34 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. పలు చోట్ల ఉక్కపోత వాతావరణం కనిపిస్తోంది. వచ్చే రోజుల్లో ఎండల ప్రభావం మరింత పెరగవచ్చని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News