Sunday, March 8, 2026
HomeTop StoriesSrikalahasti: కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం.. శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తులు!

Srikalahasti: కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం.. శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తులు!

Lunar eclipse: కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సాధారణంగా గ్రహణ సమయంలో దేశంలోని అన్ని ప్రధాన ఆలయాల తలుపులు మూసివేయడం ఆనవాయితీ. కానీ రాహు-కేతు క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం ఇందుకు భిన్నంగా గ్రహణ కాలంలోనూ తెరిచే ఉంటుంది. అంతేకాకుండా గ్రహణ సమయంలో ప్రత్యేకపూజలు చేయడం ఈ క్షేత్రంలో సంప్రదాయంగా వస్తుంది.

- Advertisement -

గ్రహణ సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు: నేడు మధ్యాహ్నం సరిగ్గా 3:20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. సాయంత్రం 6:47 గంటలకు ముగియనుంది. సుమారు మూడు గంటలకు పైగా సాగే ఈ గ్రహణ కాలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గ్రహణ సమయంలోనూ భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం తాగునీరు, అల్పాహార సౌకర్యాలను సైతం సిద్ధం చేసినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు.

Also read-Vastu Tips: పూజ గదిలో అగ్గిపెట్టె పెడుతున్నారా..అయితే కలిగే నష్టాలివే

అశుభం కాదు.. పరమ పవిత్రం!: శ్రీకాళహస్తిలో గ్రహణ సమయాన్ని అశుభంగా భావించకపోవడం ఇక్కడి ప్రత్యేకత. ఈ కాలంలోనే స్వామి, అమ్మవార్లకు నిర్వహించే గ్రహణకాల శాంతి అభిషేకాలు అత్యంత విశిష్టమైనవిగా భక్తులు నమ్ముతారు. లోక కల్యాణం కోసం గ్రహణ ప్రభావం వల్ల ఎలాంటి దోషాలు కలగకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక శాంతి పూజలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అధికారులు పేర్కొన్నారు. గ్రహణ సమయంలో రాహు-కేతువుల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ క్షేత్రంలో పూజలు చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. దీంతో రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు శ్రీకాళహస్తికి పోటెత్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News